OnePlus 13s Price : సూపర్ డిస్కౌంట్ గురూ.. ఈ వన్‌ప్లస్ 13s ఫోన్‌పై ఏకంగా రూ. 12వేలు తగ్గింపు.. ఈ డీల్ మీకోసమే..!
OnePlus 13s Price : వన్‌ప్లస్ ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. అమెజాన్‌లో ఏకంగా రూ. 12వేల తగ్గింపుతో వన్‌ప్లస్ 13s ఫోన్ సొంతం చేసుకోవచ్చు.

OnePlus 13s Price
OnePlus 13s Price : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? వన్13 ప్లస్ ధర భారీగా తగ్గింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌తో పాటు అద్భుతమైన బ్యాటరీ, ఆకర్షణీయమైన డిస్‌ప్లే (OnePlus 13s Price) కలిగి ఉంది. మీ పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలని చూస్తుంటే.. వన్‌ప్లస్ 13s కొనేసుకోవచ్చు. రూ. 60వేల లోపు ధరలో బెస్ట్ ఫోన్ ఇదే.. అమెజాన్ ఇండియాలో ఈ వన్‌ప్లస్ భారీ తగ్గింపుతో పొందవచ్చు. అంతేకాదు.. ఈ ఫోన్‌పై అనేక ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
అమెజాన్‌లో వన్‌ప్లస్ 13s ఎక్స్ఛేంజ్ డీల్ :
256GB ఇంటర్నల్ స్టోరేజ్, 12GB ర్యామ్ వేరియంట్ అసలు ధర రూ. 57,999 ఉండగా ఇప్పుడు తగ్గింపు ధరతో రూ. 54,998కు కొనుగోలు చేయవచ్చు. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా ఈ కొత్త ఫోన్ కొనుగోలుపై రూ. 33వేల వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు.
ఒకవేళ వన్‌ప్లస్ 10R మీ దగ్గర ఉంటే.. ‘With Exchange’ ఆప్షన్ ట్యాప్ చేసి ఆపై బ్రాండ్, ఫోన్, స్టోరేజీ సామర్థ్యాన్ని ఎంచుకోవాలి. ఆపై రూ. 8,700 వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా మొత్తం డిస్కౌంట్ రూ. 11,700 వరకు పెరుగుతుంది.
వన్‌ప్లస్ 13s స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
వన్‌ప్లస్ 13s ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌తో అడ్రినో 830 GPUతో రన్ అవుతుంది. జీరో లాగ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ వన్‌ప్లస్ ఫోన్ 6.32-అంగుళాల LTPO అమోల్డ్ డిస్‌ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా ఆక్సిజన్ OS 15పై రన్ అవుతుంది. ఈ ఫోన్ వాటర్, డస్ట్ నిరోధకతకు IP65 సర్టిఫికేట్ కూడా కలిగి ఉంది.
కెమెరా విషయానికొస్తే.. వన్‌ప్లస్ 13sలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP ప్రైమరీ షూటర్, 2x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ స్నాపర్‌ను కూడా కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు భారీ 5850mAh బ్యాటరీతో పవర్ అందిస్తుంది.