Oppo Find X7 Series Launch : ఒప్పో ఫైండ్ ఎక్స్7 సిరీస్ చూశారా? అదిరిపోయే ఫీచర్లు, ధర ఎంతో తెలుసా?

Oppo Find X7 Series Launch : ఒప్పో నుంచి సరికొత్త ఫోన్ వచ్చేసింది. రెండు పెరిస్కోప్ జూమ్ కెమెరాలు, అతిపెద్ద టెలిఫోటో సెన్సార్‌తో ఎక్స్7, ఎక్స్7 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. ధర, ఫీచర్ల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Oppo Find X7 Series Launch : ఒప్పో ఫైండ్ ఎక్స్7 సిరీస్ చూశారా? అదిరిపోయే ఫీచర్లు, ధర ఎంతో తెలుసా?

Oppo Find X7 Series launched, Price, Specifications

Oppo Find X7 Series Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఒప్పో నుంచి సరికొత్త మోడల్ గ్లోబల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఒప్పో ఫైండ్ ఎక్స్7, ఫైండ్ ఎక్స్7 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లను చైనాలో లాంచ్ చేసింది. ప్రీమియం స్పెసిఫికేషన్‌లతో కెమెరాలను అందించింది. ప్రత్యేకించి, ఎక్స్7 అల్ట్రా డ్యూయల్ పెరిస్కోప్ జూమ్ కెమెరాలతో ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోన్ అని చెప్పవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో అతిపెద్ద టెలిఫోటో సెన్సార్‌ కూడా ఉంది.

Read Also : Oppo Reno 11 Series : అద్భుతమైన ఫీచర్లతో ఒప్పో రెనో 11 సిరీస్.. లాంచ్ డేట్ తెలిసిందోచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

ఒప్పో ఫైండ్ ఎక్స్7 అల్ట్రా స్పెసిఫికేషన్స్ :
ఒప్పో ఎక్స్7 అల్ట్రా ఫోన్ క్యూహెచ్‌డీ+ రిజల్యూషన్‌తో 6.82-అంగుళాల అమోల్డ్ ఎల్‌టీపీఓ కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 2160హెచ్‌జెడ్ పీడబ్ల్యూఎమ్, 4,500 నిట్‌ల గరిష్ట ప్రకాశం, ప్రోఎక్స్‌డీఆర్ సపోర్టుతో వస్తుంది. డైనమిక్ పరిధిని మెరుగుపరచడంలో సాయపడుతుంది. హెచ్‌డీఆర్ ఫొటోలను మెరుగ్గా కనిపించేలా చేయడంలో సాయపడుతుంది.

అర గంటలోనే ఫాస్ట్ ఛార్జింగ్ :
ఫైండ్ ఎక్స్7 అల్ట్రా క్వాల్‌కామ్ నుంచి లేటెస్ట్ చిప్‌సెట్, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ద్వారా పనిచేస్తుంది. 16జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ సపోర్టుతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఎహెచ్ ఉంది. బాక్స్ లోపల అందించిన 100డబ్ల్యూ సూపర్ వూక్ ఛార్జర్ ద్వారా 30 నిమిషాల కన్నా తక్కువ సమయంలో వేగంగా ఛార్జ్ అవుతుంది.

Oppo Find X7 Series launched, Price, Specifications

Oppo Find X7 Series launch

ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 50ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, ఓఐఎస్‌తో 50ఎంపీ 3ఎక్స్ టెలిఫోటో లెన్స్, 50ఎంపీ 6ఎక్స్ పెరిస్కోప్ టెలిస్కోప్ లెన్స్‌తో పాటు 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ-900 సెన్సార్‌తో వెనుకవైపు క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఫైండ్ ఎక్స్7 అల్ట్రా ఫోన్ ఒప్పో కలర్ ఓఎస్ ఆధారంగా సరికొత్త ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఎన్ఎఫ్‌సీ, వై-ఫై7, బ్లూటూత్ 5.4 మరిన్నింటితో సహా అన్ని అవసరమైన కనెక్టివిటీ ఫీచర్‌లతో వస్తుంది.

ఒప్పో ఫైండ్ ఎక్స్7 అల్ట్రా ధర :
ఒప్పో ఫైండ్ ఎక్స్7 అల్ట్రా 4 ఫోన్ మొత్తం పైన్ షాడో, సిల్వర్ మూన్, వైడ్ సీ, స్కై అనే కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 12జీబీ ర్యామ్/256జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు ప్రారంభ ధర సీఎన్‌వై 5,999 (సుమారు రూ. 71వేలు), 16జీబీ ర్యామ్/256జీబీ స్టోరేజ్ వేరియంట్‌కి సీఎన్‌వై 6,499 (సుమారు రూ. 77వేలు), 16జీబీ ర్యామ్/512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సీఎన్‌వై 6,998 (రూ .83వేలు) ఉంటుంది.

Read Also : Best Phones in India 2024 : ఈ జనవరిలో రూ. 50వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!