Oppo Reno 12 Price : ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. ఒప్పో రెనో 12పై ఖతర్నాక్ డిస్కౌంట్.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!
Oppo Reno 12 Price : ఒప్పో రెనో 12 ధర తగ్గింది.. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఒప్పో రెనో 12 కొనుగోలుపై అదిరిపోయే డీల్ సొంతం చేసుకోవచ్చు.

Oppo Reno 12
Oppo Reno 12 Price : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఒప్పో రెనో 12పై అద్భుతమైన డీల్ మీకోసమే.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఈ ఒప్పో రెనో 12పై భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో ( Oppo Reno 12 Price ) రూ. 15వేలకు పైగా డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఒప్పో కొత్త ఫోన్ కొనాలని అనుకుంటే ఇప్పుడే కొనడం బెటర్.. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉండొచ్చు. ఫ్లిప్‌కార్ట్ ద్వారా అతి తక్కువ ధరకే ఈ డీల్ ఎలా పొందాలో వివరంగా తెలుసుకుందాం.
ఒప్పో రెనో 12 డీల్ :
భారత మార్కెట్లో ఒప్పో రెనో 12 ఫోన్ రూ.32,999కు లాంచ్ అయింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ రూ.20,999కు లిస్ట్ అయింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఒప్పో రెనో 12పై రూ.12వేలు ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ.3,250 తగ్గింపు పొందవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ట్రేడ్ చేయడం ద్వారా మరింత తగ్గింపు పొందవచ్చు.
ఒప్పో రెనో 12 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఒప్పో రెనో 12 5G 6.7-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ విక్టస్ 7i ప్రొటెక్షన్‌తో వస్తుంది. హుడ్ కింద రెనో 12 మీడియాటెక్ డైమెన్సిటీ 7300-ఎనర్జీ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఒప్పో రెనో 12 బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ Oppo Reno 12 Price కోసం 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. ఒప్పో రెనో 12 మోడల్ 5000mAh బ్యాటరీతో వస్తుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఏఐ బెస్ట్ ఫేస్, ఏఐ రైటర్, ఏఐ రికార్డింగ్ సమ్మరీ, ఏఐ ఎరేజర్ 2.0, ఏఐ స్టూడియో వంటి అనేక ఏఐ ఫీచర్లను కూడా అందిస్తుంది.