Oracle Layoffs : తీసేసిన ఉద్యోగులకి ఒరాకిల్ ఎన్ని కోట్లు ఇస్తుంది? ఒక్కొక్కరికి..
Oracle Layoffs : టెక్ కంపెనీల చరిత్రలోనే కనీవిన ఎరగని రీతిలో ఒకేసారి 30 వేల మంది ఉద్యోగులను తొలగిస్తూ ఒరాకిల్ నిర్ణయం తీసుకుంది. మరి తొలగించిన ఉద్యోగులకు ఎంత చెల్లిస్తుంది అంటే..
oracle layoffs 2026 how much compensation get employees from company details here
- ఒరాకిల్ లో 30 వేల మంది ఉద్యోగులు తొలగింపు
- వీరిలో 12 వేల మంది భారతీయులే
- తొలగించిన ఉద్యోగులకి ఎన్ని కోట్లు ఇస్తుందనేపై చర్చ
Oracle Layoffs : సాఫ్ట్ వేర్ రంగంలో ఏఐ సునామీ ఇప్పట్లో ఆగేలా లేదు. ఆల్రెడీ చాలా కంపెనీలు ఉద్యోగులను సాగనంపుతున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు ఒరాకిల్ కూడా తమ ఉద్యోగులను పంపేస్తోంది. సుమారు 30000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. అందులో 12000 మంది భారతీయ ఉద్యోగులే ఉన్నట్టు అంచనాలు ఉన్నాయి. అయితే, దీనిపై ఫుల్ క్లారిటీ రావాల్సి ఉంది. కానీ, తీసేస్తున్న ఉద్యోగులకు సంబంధించి కంపెనీ ఎంత డబ్బులు చెల్లిస్తోందనే అనుమానం చాలా మందిలో ఉంది. ఉన్నట్టుండి వారిని తీసేస్తే ఎలా అనే ఆందోళన కూడా ఉంది. అయితే, ఇలాంటి సందర్భాల్లో కంపెనీలు కొన్ని కొన్ని రూల్స్ పాటిస్తాయి. ఏదైనా ఆయా దేశాల్లో ఉండే కార్మిక శాఖ రూల్స్ ని బట్టి ఫాలో అవుతుంటాయి.
ఉదాహరణకు వస్తే అమెరికాలో తీసేసిన ఉద్యోగులకు నాలుగు వారాల బేసిక్ శాలరీ ఇస్తున్నారు. దీంతో పాటు ఆ ఉద్యోగి ఎన్నేళ్ల నుంచి కంపెనీలో పనిచేస్తే అన్ని వారాలు అదనంగా వేతనం చెల్లిస్తున్నారు. అంటే సుమారు ఒక ఉద్యోగి 5 ఏళ్ల నుంచి ఒరాకిల్ లో పనిచేస్తే అతనికి 4 వారాల బేసిక్ శాలరీతో పాటు ఐదు వారాల వేతనం వస్తుంది. అంటే రెండు నెలల మీద ఒక వారం వేతనం అందుతుంది. అదే మరో ఉద్యోగి 20 ఏళ్ల నుంచి పనిచేస్తుంటే అతనికి 4 వారాల బేసిక్ శాలరీతో పాటు 20 వారాలు (5 నెలలు) వేతనం అదనంగా వస్తుంది. అంటే 20 ఏళ్లు పనిచేసిన ఉద్యోగికి 6 నెలల వేతనం వస్తుందన్నమాట.
ఒరాకిల్‌లో ఈ తీసివేతల వల్ల సుమారు 8 బిలియన్ డాలర్ల నుంచి 10 బిలియన్ డాలర్ల వరకు ఆదా అయ్యే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. వాళ్ల ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అన్నీ పోతాయి కాబట్టి ఈ మేరకు ఆదా అయ్యే చాన్స్ ఉంది. అయితే, కంపెనీలో అత్యధికంగా ఎఫెక్ట్ అయిన విభాగాలను చూస్తే సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్, ప్రొడక్ట్ డెవలప్ మెంట్, కస్టమర్ సపోర్ట్ రోల్స్ విభాగాలు అత్యంత ఎఫెక్ట్ అయ్యాయి. ఈ విభాగాల నుంచే పెద్ద ఎత్తున ఉద్యోగులను తీసేశారు.
2025 మే నాటి లెక్కల ప్రకారం ఒరాకిల్‌లో సుమారు 162,000మంది ఉద్యోగులు ఉన్నాయి. అయితే, కంపెనీ అప్పులు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో సుమారు 50 బిలియన్ డాలర్ల మొత్తాన్ని ఈక్విటీల ద్వారా సేకరించాలని నిర్ణయించింది. అయితే, 2026లో మళ్లీ కొత్తగా రుణాలు తీసుకునే ప్లాన్లేవీ లేవని కంపెనీ ప్రకటించింది.
