PM Kisan 24th Installment : రైతులకు కేంద్రం తీపికబురు.. దసరాకు ముందే ఖాతాల్లోకి పీఎం కిసాన్ రూ. 2వేలు..
PM Kisan 24th Installment : పీఎం కిసాన్ 24వ విడత నిధుల విడుదలకు సంబంధించి కీలక అప్డేట్.. వచ్చే అక్టోబర్లో రైతుల ఖాతాల్లో రూ.2వేలు జమ కానున్నట్లు సమాచారం. లబ్ధిదారులు ఈకేవైసీ, ఆధార్, బ్యాంక్ వివరాలు తప్పక చెక్ చేసుకోవాలి.
PM Kisan 24th Installment
- రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. అక్టోబర్ 17న విడుదల?
- దసరా కానుకగా పీఎం కిసాన్ నిధులపై కీలక సమాచారం
- రైతుల ఎదురుచూపులకు తెర.. త్వరలోనే ఖాతాల్లో రూ.2వేలు
PM Kisan 24th Installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. దేశవ్యాప్తంగా రైతులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 24వ విడతపై కీలక అప్డేట్ వచ్చింది. వచ్చే అక్టోబర్లో పీఎం కిసాన్ రూ. 2వేలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు కేంద్రం రెడీ అవుతోంది.
దసరా పండుగకు ముందుగానే రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. నివేదికల ప్రకారం.. అక్టోబర్ 17న రూ.2వేలు చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానుంది. అయితే, అధికారిక విడుదల తేదీపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. పీఎం కిసాన్ పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబాలకు ఏడాదికి మొత్తం రూ.6వేలు ఆర్థిక సాయం అందుతోంది. ఈ మొత్తాన్ని 3 విడతల్లో ఒక్కోసారి రూ.2వేలు చొప్పున చెల్లిస్తారు.
మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ రైతులకు ఈసారి అదనపు ప్రయోజనం లభించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ నిధులతో పాటు పీఎం కిసాన్ నగదు కూడా ఒకే సమయంలో అందితే మొత్తం రూ.6వేల వరకు జమ కావచ్చు.
Read Also : SBI ATM Rules : ATM నుంచి డబ్బులు తీస్తున్నారా? SBI కొత్త ఛార్జీలు ఇవే
అయితే, తదుపరి విడత పొందాలంటే రైతులు తమ వివరాలను ముందుగానే చెక్ చేసుకోవడం చాలా అవసరం. ఇ-కేవైసీ పూర్తి చేసి ఉండాలి. అలాగే, ఆధార్ వివరాలు, బ్యాంక్ ఖాతా, NPCI మ్యాపింగ్, భూమి రికార్డుల లింకింగ్ ప్రక్రియ సక్రమంగా ఉండాలి.
లబ్ధిదారుల జాబితాలో తమ పేరు ఉందో లేదో రైతులు పీఎం కిసాన్ అధికారిక పోర్టల్లోని ఫార్మర్ కార్నర్ ద్వారా పరిశీలించుకోవచ్చు. ఆధార్ లేదా మొబైల్ వివరాలతో సంబంధిత రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామాన్ని ఎంపిక చేసి జాబితాను చెక్ చేసుకోవచ్చు.
పీఎం కిసాన్ డబ్బులు వస్తాయా? లేదో ఇలా తెలుసుకోవచ్చు.
- Pmkisan.gov.in అధికారిక పోర్టల్ ఓపెన్ చేయండి.
- హోమ్ పేజీలో (Farmers Corner) ఆప్షన్ ఎంచుకోండి.
- ఆధార్, మొబైల్ నెంబర్, స్టేట్, జిల్లా, మండలం, గ్రామం వివరాలను ఎంటర్ చేయండి.
- మీ గ్రామ లబ్దిదారుల లిస్టు అందులో కనిపిస్తుంది.
- అందులో మీ పేరు ఉందో లేదో ఈజీగా చెక్ చేసుకోవచ్చు.
