Post Office Scheme : పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్.. ఇలా డబ్బులు పెట్టారంటే.. నెలకు రూ.9,250 ఆదాయం పక్కా..!
Post Office Scheme : పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌లో రూ.15 లక్షల పెట్టుబడితో నెలకు రూ.9,250 వడ్డీ పొందవచ్చు. వడ్డీ రేటు, పెట్టుబడి పరిమితులు, ఐదేళ్ల కాలవ్యవధి, పన్ను నిబంధనల వివరాలపై ఓసారి లుక్కేయండి..
Post Office Scheme
- కేంద్ర ప్రభుత్వ అద్భుతమైన పథకం
- ప్రతీ నెలా ఖాతాలోకి డబ్బులే డబ్బులు..
- 5 ఏళ్ల ఇలా ఇన్వెస్ట్ చేశారంటే భారీగా ఆదాయం
Post Office Scheme : డబ్బులు పొదుపు చేస్తున్నారా? లేదంటే ఇప్పుడే చేయడం మొదలుపెట్టండి.. మీరు డబ్బులు సేవ్ చేస్తూ పోతే అదే మీకు ప్రతినెలా ఆదాయం రూపంలో చేతికి వస్తుంది. మీ సేవింగ్ డబ్బులతో ఎందులో ఇన్వెస్ట్ చేస్తే భారీగా ఆదాయం పొందవచ్చునో తెలుసా? మీకోసం పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (POMIS) అద్భుతంగా ఉంటుంది.
ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత మీకు నెలవారీ ఆదాయం కావాలంటే సీనియర్ సిటిజన్లు, కుటుంబ ఖర్చుల కోసం ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం అందించే చిన్న మొత్తాల పొదుపు పథకాలలో ఇదొకటి. ఇందులో నిర్ణీత కాలానికి డబ్బు జమ చేస్తే మీకు ప్రతి నెలా భారీ వడ్డీ వస్తూనే ఉంటుంది. ఇంతకీ ఈ స్కీమ్ వడ్డీ రేట్లు, పెట్టుబడి పరిమితి, పన్ను నిబంధనలపై ఓసారి వివరంగా చూద్దాం..
ఐదేళ్ల పాటు నెలవారీ ఆదాయం :
ఈ పథకంలో పెట్టుబడి వ్యవధి ఐదేళ్లు. ప్రస్తుతం వార్షిక వడ్డీ రేటు 7.4 శాతంగా ఉంటే, పెట్టిన మొత్తానికి అనుగుణంగా నెలవారీ వడ్డీ లభిస్తుంది. అయితే, వడ్డీ రేట్లు ప్రభుత్వ సమీక్షకు లోబడి ఉంటాయి అందుకే ఖాతా తెరిచే సమయంలోనే ఆయా వివరాలను తెలుసుకుని ఉండటం ఎంతైనా మంచిది.
Read Also : Oppo Find X9 Ultra : అమెజాన్ బంపర్ ఆఫర్.. ఒప్పో అల్ట్రా ఫోన్ భారీగా తగ్గిందోచ్.. ఈ క్రేజీ డీల్ డోంట్ మిస్..!
ఉదాహరణకు.. జాయింట్ ఖాతాలో రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తే.. 7.4 శాతం వార్షిక రేటు ప్రకారం ఏడాదికి రూ.1,11,000 వడ్డీ వస్తుంది. అంటే నెలకు రూ.9,250 చొప్పున ఆదాయం పొందవచ్చు. అదే రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు సుమారు రూ.3,083 అందుతుంది. సింగిల్ ఖాతాలో రూ.9 లక్షలు జమ చేస్తే నెలవారీ వడ్డీ రూ.5,550గా ఉంటుంది.
పెట్టుబడి పరిమితులు ఏంటి? :
ఈ పథకంలో కనీసం రూ.1,000తో ఖాతా ఓపెన్ చేయొచ్చు. ఒక వ్యక్తి పేరుతో ఓపెన్ చేసే సింగిల్ ఖాతాకు గరిష్ట డిపాజిట్ పరిమితి రూ.9 లక్షలు. జాయింట్ ఖాతాకు గరిష్ట పరిమితి రూ.15 లక్షలు. అందుకే పెట్టుబడి పెట్టే ముందు అకౌంట్ టైప్, అందుబాటులో ఉన్న పరిమితులను పరిశీలించడం అవసరం.
పన్నుల విషయంలో జాగ్రత్త :
ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన అసలుపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద మినహాయింపు లభించదు. అలాగే, అందుకునే వడ్డీ సాధారణంగా పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయమే. అందుకే పెట్టుబడి నిర్ణయం తీసుకునేటప్పుడు పన్నుల ప్రభావాన్ని కూడా లెక్కలోకి తీసుకోవడం మంచిది.
మొత్తంగా, మార్కెట్ రిస్క్ లేని స్కీమ్ ఇది.. నెలవారీ ఆదాయం కోరుకునేవారికి పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అద్భుతమైన ఆప్షన్. అయితే, ఇందులో పెట్టిన అసలు మొత్తం ఐదేళ్ల కాలపరిమితి తప్పనిసరిగా ఉండాలి. అకౌంట్ ఓపెన్ చేసే ముందు మీ సమీప పోస్టాఫీస్‌లో ప్రస్తుత వడ్డీ రేటు, నిబంధనలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి.
