LPG Gas Subsidy : కొత్త LPG గ్యాస్ కనెక్షన్ కావాలా? PMUYతో సబ్సిడీ గ్యాస్.. అప్లై చేసే ఫుల్ ప్రాసెస్ ఇదే!
LPG Gas Subsidy : భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన (PMUY) దేశంలో రాయితీతో కూడిన ఎల్పీజీ కనెక్షన్లను అందిస్తుంది. ఇప్పుడు అందరికి సబ్సిడీ కూడా అందనుంది.
LPG Gas Subsidy
- PMUY దేశంలో ఎల్పీజీ గ్యాస్‌ను సబ్సిడీపై అందిస్తుంది.
- పేద కుటుంబాల మహిళలకు ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు
- పీఎంయూవై పథకాన్ని పీఎం మోదీ 2016 మే 1న ప్రారంభించారు
LPG Gas Subsidy : కొత్త ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ కావాలా? అయితే ఇది మీకోసమే.. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) సబ్సిడీతో ఎల్పీజీ కనెక్షన్లను అందిస్తోంది. ఈ పథకం పేద కుటుంబాలకు చెందిన మహిళలు ఉచితంగా LPG గ్యాస్ కనెక్షన్లు అందుకోవచ్చు.
2016 మే 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ పథకం పేద కుటుంబాల మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాల వారికి బెనిఫిట్ అందిస్తుంది. ఈ స్కీమ్ కింద అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం, ఎల్పీజీ సిలిండర్లపై రాయితీలు అందుతాయి. మీరు ఈ పథకానికి అప్లయ్ చేయాలని ఆసక్తిగా ఉంటే ముందుగా ఈ ప్రాసెస్ సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవడం ముఖ్యం.
PMUY కనెక్షన్‌కు అర్హతలివే :
18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు మాత్రమే ఈ కనెక్షన్ కోసం అప్లయ్ చేసుకోవచ్చు. ఎల్పీజీ కనెక్షన్ కోసం అప్లయ్ చేసే కుటుంబానికి మరే ఇతర కంపెనీ నుంచి వేరే ఎల్పీజీ కనెక్షన్లు ఉండకూడదు. దరఖాస్తుదారు పేద కుటుంబానికి చెందినవారై ఉండాలి. (నిర్దేశించిన ఫార్మాట్ ప్రకారం) సమర్పించాలి.
ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి :
- కేవైసీ అప్లికేషన్ ఫారమ్
- ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు
- అడ్రస్ ప్రూఫ్ (వలసదారుల కోసం సెల్ఫ్ డిక్లరేషన్)
- ఆ రాష్ట్ర రేషన్ కార్డు/కుటుంబ వివరాలతో తప్పక ఉండాలి
- రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఇతర డాక్యుమెంట్
- (వలస దరఖాస్తుదారుల కోసం అనుబంధం I ప్రకారం సెల్ఫ్ డిక్లరేషన్)
- దరఖాస్తుదారు, ఇతర వయోజన కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు
- పాస్‌బుక్ కాపీ/క్యాన్సిల్ చెక్కుతో పాటు బ్యాంకు ఖాతా వివరాలు
ఎలా అప్లయ్ చేయాలంటే? :
- ముందుగా, ప్రభుత్వ అధికారిక పోర్టల్ (https://pmuy.gov.in/)ను విజిట్ చేయండి.
- హోమ్‌పేజీలో ‘Apply for New Ujjwala PMUY Connection’పై క్లిక్ చేయండి.
- ఆ తర్వాత, ‘Click Here to apply for New PMUY Connection’పై క్లిక్ చేయండి.
- అప్పుడు స్క్రీన్‌పై 3 గ్యాస్ కంపెనీల ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో ఒకటి ఎంచుకోండి.
- ఆ తర్వాత ‘Click Here to Apply’పై క్లిక్ చేయండి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో మీ గ్యాస్ కంపెనీ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వండి.
- ఫస్ట్ టైమ్ అయితే అకౌంట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి
- మీ వ్యక్తిగత సమాచారం, అడ్రస్, బ్యాంక్ వివరాలతో ఆన్లైన్ కేవైసీ ఫారమ్‌ను నింపాలి.
- ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఫోటో స్కాన్ చేసిన కాపీని అప్లోడ్ చేయండి.
- ఫారమ్‌ను సబ్మిట్ చేశాక రిఫరెన్స్ నంబర్ వస్తుంది.
- దాన్ని సేవ్ చేసుకోండి. చివరిగా అప్లికేషన్ ప్రింట్ తీసుకోండి.
- ఫైనల్ వెరిఫికేషన్ కోసం మీ డాక్యుమెంట్లలోని లోకల్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వద్దకు వెళ్లండి.
