Primebook 3 Max : ఏఐ ఫీచర్లతో కొత్త ప్రైమ్బుక్ 3 మ్యాక్స్ ల్యాప్‌టాప్.. ధర జస్ట్ రూ. 36వేలు.. 8GB ర్యామ్, 12 గంటల బ్యాటరీ లైఫ్
Primebook 3 Max : భారత మార్కెట్లో ప్రైమ్బుక్ 3 మ్యాక్స్ రూ. 35,990 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. 8GB ర్యామ్, 15.6-అంగుళాల డిస్ప్లే 60.3Wh బ్యాటరీతో వస్తుంది.
Primebook 3 Max
- భారత్‌లో ప్రైమ్బుక్ 3 మ్యాక్స్ ధర రూ. 35,990 నుంచి ప్రారంభం
- ఈ ల్యాప్‌టాప్‌లో మీడియాటెక్ జీనియో 720 ప్రాసెసర్ 8GB ర్యామ్
- 60.3Wh బ్యాటరీ, 12 గంటల వరకు రన్ అవుతుంది
Primebook 3 Max : ప్రైమ్బుక్ కొత్త ల్యాప్‌టాప్ సిరీస్ వచ్చేసింది. భారత మార్కెట్లో ప్రైమ్బుక్ 3 మ్యాక్స్ లాంచ్ అయింది. కంపెనీ థర్డ్ జనరేషన్ ల్యాప్‌టాప్ సిరీస్‌లో ఫస్ట్ మోడల్. ఇందులో మీడియాటెక్ జీనియో 720 ప్రాసెసర్‌తో పాటు 8GB LPDDR5 ర్యామ్, 128GB యూఎఫ్ఎస్ స్టోరేజ్ ఉన్నాయి. 1TB వరకు పెంచుకోవచ్చు.
ఈ ల్యాప్‌టాప్‌లో 15.6-అంగుళాల ఫుల్ HD IPS యాంటీ-గ్లేర్ డిస్ప్లే ఉంది. 60.3Wh బ్యాటరీ, 36W USB-C ఛార్జింగ్, Wi-Fi 6 బ్లూటూత్ 5.3 వంటి ఫీచర్లు ఉన్నాయి. కంపెనీ ప్రకారం.. ఈ కొత్త హార్డ్‌వేర్ గత జనరేషన్ కన్నా 40 శాతం వరకు అద్భతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది.
ప్రైమ్బుక్ 3 మ్యాక్స్, మీడియాటెక్ జీనియో 720 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇందులో 2.6GHz క్లాక్ స్పీడ్‌తో 2 A78 కోర్లు 2.0GHz క్లాక్ స్పీడ్‌తో 6 A55 కోర్లు ఉన్నాయి. గ్రాఫిక్స్‌ను మాలి-G57 MC2 జీపీయూ నిర్వహిస్తుంది. ఇందుకు 8GB LPDDR5 ర్యామ్, 128GB UFS స్టోరేజ్ కూడా అందిస్తుంది. ఈ స్టోరేజ్‌ను మైక్రో SD ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు.
సింగిల్ ఛార్జ్‌పై 12 గంటల వరకు బ్యాకప్ :
ఈ ల్యాప్‌టాప్‌లో 1,920 x 1,080 పిక్సెల్ రిజల్యూషన్ 250 నిట్స్ టాప్ బ్రైట్ నెస్, 15.6-అంగుళాల ఫుల్ HD IPS యాంటీ-గ్లేర్ డిస్ప్లే ఉంది. బ్యాటరీ లైఫ్ 60.3Wh అందిస్తుంది. సింగిల్ ఛార్జ్‌పై 12 గంటల వరకు వస్తుందని కంపెనీ పేర్కొంది. 36W USB-C ద్వారా ఛార్జింగ్ అవుతుంది.
ప్రైమ్బుక్ 3 మ్యాక్స్‌లో Wi-Fi 6 బ్లూటూత్ 5.3తో పాటు, USB-C 3.2, USB-C 2.0, USB-A 3.2, USB-A 2.0 పోర్ట్‌లు ఉన్నాయి. మైక్రో SD కార్డ్ స్లాట్ 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉన్నాయి. వీడియో కాలింగ్ కోసం 5MP వెబ్‌క్యామ్ అందించారు. 30fps వద్ద 1440p వీడియోను రికార్డ్ చేస్తుంది. డ్యూయల్ మైక్రోఫోన్లు, స్టీరియో స్పీకర్లు బ్యాక్లిట్ కీబోర్డ్ కూడా ఉన్నాయి.
Read Also : Onion Price Hike: కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లిధర.. ఏడాదిలోనే 94 శాతం పెరుగుదల.. కిలో ఎంత ఉందో తెలుసా?
ప్రైమ్బుక్ 3 మ్యాక్స్, కంపెనీ ప్రైమ్ఓఎస్తో వస్తుంది.ప్రైమ్ఆఫీస్ అనే ఆఫ్‌లైన్-ఫస్ట్ ప్రొడక్టివిటీ సూట్‌ను అందిస్తుంది. డాక్యుమెంట్లు, స్ప్రెడ్షీట్లు ప్రజెంటేషన్లను క్రియేట్ చేయొచ్చు. ప్రైమ్లినక్స్, విఎస్ కోడ్, జింప్, లిబ్రేఆఫీస్, ఫైర్ఫాక్స్, ఆర్డుయినో ఐడిఇ పోస్ట్‌మ్యాన్ వంటి సాఫ్ట్వేర్లకు సపోర్టు ఇస్తుంది.
ప్రైమ్సెక్యూరిటీ టాస్క్ మేనేజర్ సిస్టమ్ యాప్‌లను మానిటరింగ్ చేయగలదు. ప్రైమ్ఎక్స్ క్లౌడ్ పీసీ ద్వారా విండోస్ సాఫ్ట్‌వేర్‌ను వాడుకోవచ్చు. అలాగే ప్రైమ్ఏజిఎన్టి ఆపరేటర్ ఏఐ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది.
ప్రైమ్బుక్ 3 మాక్స్ ధర, లభ్యత :
ప్రైమ్బుక్ 3 మ్యాక్స్ అక్టోబర్ 1, 2026న భారత మార్కెట్లో అమ్మకానికి రానుంది. ప్రారంభ ధర రూ. 35,990 మాత్రమే.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్రైమ్బుక్లో అందుబాటులో ఉంది. వెబ్సైట్, ఢిల్లీ-ఎన్‌సిఆర్ బెంగళూరులోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంటుంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని సంగీత మొబైల్స్ పై ఇంటర్నేషనల్ స్టోర్లలో కూడా లభిస్తుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సమయంలో ఈ ల్యాప్‌టాప్ తగ్గింపు ధరకు లభించనుంది.
