Realme Christmas Sale : అమెజాన్‌లో రియల్‌మి క్రిస్మస్ సేల్.. ఈ నార్జో స్మార్ట్‌ఫోన్లపై బిగ్ డిస్కౌంట్లు.. డోంట్ మిస్!

Realme Christmas Sale : రియల్‌మి 'క్రిస్మస్ సేల్'లో భాగంగా రియల్‌మి నార్జో 60 ప్రో సిరీస్ 5జీ, రియల్‌మి నార్జో ఎన్55, ఇతర మోడళ్ల రేంజ్‌పై ఆకర్షణీయమైన డీల్‌లను అందిస్తోంది. డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 26 వరకు డీల్ అందుబాటులో ఉంటాయి.

Realme Christmas Sale : అమెజాన్‌లో రియల్‌మి క్రిస్మస్ సేల్.. ఈ నార్జో స్మార్ట్‌ఫోన్లపై బిగ్ డిస్కౌంట్లు.. డోంట్ మిస్!

Realme Christmas Sale on Amazon_ Big discounts on narzo 60 Pro, narzo N53 and more

Realme Christmas Sale : క్రిస్మస్ పండుగ దగ్గర పడుతోంది. ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. రియల్‌మి ‘క్రిస్మస్ సేల్’లో భాగంగా రియల్‌మి నార్జో 60 ప్రో సిరీస్ 5జీ, రియల్‌మి నార్జో 60ఎక్స్ 5జీ, రియల్‌మి నార్జో ఎన్55, రియల్‌మి నార్జో ఎన్53తో సహా అనేక రకాల మోడల్‌లపై ఆకర్షణీయమైన డీల్స్ అందిస్తోంది. ఈ ప్రత్యేకమైన ప్రమోషన్‌లు డిసెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి డిసెంబర్ 26 వరకు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు.. (Amazon.in), అధికారిక రియల్‌మి వెబ్‌సైట్ రెండింటిలోనూ యాక్సెస్ చేయవచ్చు.

Read Also : Realme GT 5 Pro Launch : రియల్‌మి జీటీ 5 ప్రో ఫోన్ వచ్చేసింది.. ధర, పూర్తి స్పెషిఫికేషన్లు ఇవే

ఆఫర్‌లో తగ్గిన ధరలు, కూపన్ బెనిఫిట్స్ సహా వివిధ వెర్షన్‌లు ఉన్నాయి. ఉదాహరణకు, రియల్‌మి నార్జో 60 ప్రో 5జీ డిస్కౌంట్ ధరలు, కూపన్ బెనిఫిట్స్‌తో విభిన్న కాన్ఫిగరేషన్‌లను అందిస్తుంది. సేల్ సమయంలోఆకర్షణీయమైన ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు. 12జీబీ +1టీబీ వేరియంట్ ప్రారంభ ధర రూ. 29,999కు సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు రూ. 27,999 తగ్గింపు ధరతో పాటు రూ. 2వేలు కూపన్ బెనిఫిట్స్ కూడాపొందవచ్చు.

వేరియంట్ల వారీగా కూపన్ బెనిఫిట్స్ :
రియల్‌మి నార్జో 60 5జీ స్మార్ట్‌ఫోన్, రియల్‌మి నార్జో 60ఎక్స్ 5జీతో పాటు హై-పర్ఫార్మెన్స్ డివైజ్‌లపై భారీగా తగ్గింపు ధరలకు అందిస్తోంది. ఈ ఫోన్లలో 8జీబీ+128జీబీ కాన్ఫిగరేషన్‌ను కలిగిన నార్జో 60 5జీ, ఇప్పుడు అసలు రూ. 17,999 నుంచి రూ.15,499 ధరకు తగ్గింది. రూ. 2,500 కూపన్ బెనిఫిట్స్ అందిస్తుంది. రియల్‌మి నార్జో 60ఎక్స్ 5జీ విషయానికొస్తే.. 6జీబీ+128బీబీ వేరియంట్ ఇప్పుడు రూ. 12,999 తగ్గింపు ధరతో అందిస్తోంది. దాంతో పాటు రూ. 1,500 కూపన్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.

Realme Christmas Sale on Amazon_ Big discounts on narzo 60 Pro, narzo N53 and more

Realme Christmas Sale on Amazon 

రియల్‌మి నార్జో ఎన్53 విషయానికి వస్తే..
ఈ స్మార్ట్‌ఫోన్, రియల్‌మి నార్జో ఎన్55తో పాటు డిస్కౌంట్‌లు, కూపన్‌ల ద్వారా తగ్గింపు ధరలను అందిస్తుంది. వివిధ ధరల బ్రాకెట్‌లలో అనేక ఆప్షన్లను అందిస్తోంది. రియల్‌మి 6జీబీ+128జీబీ కాన్ఫిగరేషన్‌ను కలిగిన నార్జో ఎన్55 అసలు ధర రూ. 12,999 నుంచి తగ్గడంతో ప్రస్తుతం రూ. 9,999గా ఉంది. రూ. 3వేల కూపన్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. మరోవైపు.. 4జీబీ+64జీబీ వేరియంట్‌ రియల్‌మి నార్జో ఎన్53 అసలు ధర రూ. 8,999 నుంచి రూ. 7,999 తగ్గింపు అందిస్తోంది. అలాగే, రూ.1,000 కూపన్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.

Read Also : Realme C67 4G Launch : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో రియల్‌మి C67 4జీ ఫోన్.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!