Renault May 2026 : రెనాల్ట్ మే 2026 బంపర్ ఆఫర్లు.. ఈ కార్లపై రూ.65 వేల వరకు డిస్కౌంట్లు.. ఏ కారు కొంటారో మీ ఇష్టం!
Renault May 2026 : రెనాల్ట్ మే 2026లో కైగర్, ట్రైబర్ క్విడ్ అనే 3 మోడళ్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఆఫర్ల బెనిఫిట్స్ మోడల్ స్టాక్ సంవత్సరం బట్టి మారుతూ ఉంటాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Renault May 2026 Offers
- మే 2026 రెనాల్ట్ కారు మోడళ్లపై అద్భుతమైన డిస్కౌంట్లు
- ఈ కార్లపై దాదాపు రూ. 65వేల వరకు డిస్కౌంట్లు
- మే 2026లో రెనాల్ట్ 3 మోడళ్లు కైగర్, ట్రైబర్ క్విడ్‌లపై డిస్కౌంట్లు
Renault May 2026 : కొత్త కారు కొనేవారికి అద్భుతమైన ఆఫర్లు.. మే 2026లో రెనాల్ట్ 3 మోడళ్లు కైగర్, ట్రైబర్ క్విడ్‌లపై అద్భుతమైన డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ల బెనిఫిట్స్ మోడల్, స్టాక్ ఇయర్ బట్టి మారుతూ ఉంటాయి.
ఈ నెలలో, కైగర్ ఎస్‌యూవీపై రూ. 65వేల వరకు అత్యధిక డిస్కౌంట్ (Renault May 2026) అందిస్తోంది. కానీ, డస్టర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీపై ఎలాంటి ఆఫర్ లేదు. అన్ని ఆఫర్లు మే 31, 2026 వరకు అందుబాటులో ఉంటాయి. సిటీ, డీలర్‌షిప్‌ను బట్టి ధర మారవచ్చు.
మే 2026లో రెనాల్ట్ కైగర్ డిస్కౌంట్లు :
ఈ నెలలో కైగర్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ప్రస్తుతం VIN 2026 స్టాక్‌పై రూ. 65వేల వరకు మొత్తం బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో రూ. 20వేల క్యాష్ డిస్కౌంట్, రూ. 15వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 15వేల వరకు లాయల్టీ బెనిఫిట్స్, రూ. 10వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్, రూ. 4వేల వరకు ఇతర బెనిఫిట్స్ ఉన్నాయి.
పాత MY2025 స్టాక్ కొనుగోలుదారులు రూ. 88,500 వరకు బెనిఫిట్స్ ద్వారా మరింత ఆదా చేసుకోవచ్చు. రెనాల్ట్ కైగర్ ధర రూ. 5.81 లక్షల నుంచి రూ.10.34 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంది.
రెనాల్ట్ ట్రైబర్ మే 2026లో డిస్కౌంట్లు :
ఈ నెలలో రెనాల్ట్ ట్రైబర్ VIN 2026 మోడల్ రూ. 45వేల వరకు తగ్గింపుతో లభిస్తుంది. ఈ ఆఫర్లో రూ. 15వేల క్యాష్ డిస్కౌంట్, రూ. 15వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బోనస్ రూ. 10వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి.
అర్హులైన కస్టమర్లు రూ. 4వేలు ఇతర బెనిఫిట్ కూడా పొందవచ్చు. పాత MY2025 మోడల్ కొనుగోలు చేసే కస్టమర్లు రూ. 60వేల వరకు అదనపు సేవింగ్ పొందవచ్చు. ట్రైబర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.81 లక్షల నుంచి రూ.8.48 లక్షల మధ్య ఉంటుంది.
మే 2026లో రెనాల్ట్ క్విడ్ డిస్కౌంట్లు :
ఈ నెలలో 3 మోడళ్లలో రెనాల్ట్ క్విడ్ హ్యాచ్‌బ్యాక్‌కు అత్యంత తక్కువ ఆఫర్ లభిస్తోంది. వీఐఎన్ 2026 స్టాక్‌పై రూ. 10వేల క్యాష్ డిస్కౌంట్, రూ. 15వేల వరకు లాయల్టీ బోనస్, రూ. 10వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్, రూ. 4వేల బెనిఫిట్స్ సహా మొత్తం రూ. 40వేల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు.
మీరు పాత MY2025 స్టాక్ కొనుగోలు చేస్తే.. రూ. 50వేల వరకు ఆదా చేసుకోవచ్చు. రెనాల్ట్ క్విడ్ ధర రూ. 4.30 లక్షల నుంచి రూ.5.88 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంది.
అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ధరలే. ఈ ఆఫర్లు మే 31, 2026 వరకు అందుబాటులో ఉంటాయి. సిటీ, డీలర్షిప్, స్టాక్ లభ్యతను బట్టి ధరలు మారవచ్చు. కొనుగోలు చేసే ముందు దయచేసి మీకు సమీపంలోని రెనాల్ట్ డీలర్షిప్ వద్దకు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోండి.
