Carrymen Assistant : భర్తలకు, తల్లులకు బిగ్ రిలీఫ్.. మీరు షాపింగ్ చేయండి.. మీ లగేజీని మోసే అసిస్టెంట్ వచ్చేసింది!
Carrymen Assistant : షాపింగ్ చేయడం ఇకపై చాలా ఈజీ.. ఢిల్లీకి చెందిన 'క్యారీమెన్' అనే స్టార్టప్ గంటకు కేవలం రూ. 149కే 'షాపింగ్ అసిస్టెంట్' సర్వీసును ప్రారంభించింది. ఈ అసిస్టెంట్ బరువైన బ్యాగులను మోయడం, స్టోర్ల రద్దీలో దారి చూపడం వంటి అన్ని పనులు చేస్తారు..
Carrymen Assistant ( Image Credit to Origiinal Source )
- షాపింగ్‌కు వెళ్లారా..? ఇక బ్యాగ్స్ టెన్షన్ లేనట్టే
- షాపింగ్‌లో అలసటకు చెక్.. బ్యాగ్స్ మోసే మనుషులు తెచ్చుకోవచ్చు
- తల్లులకు గుడ్ న్యూస్.. గంటకు రూ.149 చెల్లిస్తే చాలు..
- షాపింగ్ మాల్లో కొత్త సౌకర్యం.. మీ లగేజీ మోసే స్పెషల్ అసిస్టెంట్లు
Carrymen Assistant : షాపింగ్ చేసేవారికి గుడ్ న్యూస్.. ముఖ్యంగా భర్తలకు, తల్లులకు బాయ్ ఫ్రెండ్‌కు ఇక లగేజీ మోసే బాధ ఉండదు. షాపింగ్ సమయంలో గంటల కొద్ది లగేజీ మోస్తూ ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. మీ లగేజీని మోసే వాళ్లు ఇప్పుడు వస్తారు.. షాపింగ్ అయ్యేవరకు మీతోనే ఉంటారు.
మీరు ఇంటికి సేఫ్‌గా చేరంతవరకు మీకు సాయం చేస్తారు. అది ఎలా అంటారా? ఢిల్లీకి చెందిన క్యారీమెన్ అనే స్టార్టప్ కంపెనీ వినూత్నమైన సర్వీసుతో ముందుకు వచ్చింది. ఢిల్లీలోని లజపత్ నగర్ మార్కెట్లో ఈ కొత్త సర్వీసు ప్రారంభమైంది.
మీరు చేయాల్సిందిల్లా.. గంటకు రూ. 149 చెల్లిస్తే చాలు.. ఈ సంస్థ మీకోసం ఒక షాపింగ్ అసిస్టెంట్ బుక్ చేసి పెడుతుంది. మీరు షాపింగ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇంటికి వెళ్లేంతవరకు మీ లగేజీ మొత్తం వీరే మోస్తారు. బరువైన లగేజీ మోయాలనే ఆలోచనతోనే సతమతమయ్యే అలసిపోయిన భర్తలకు, తల్లులకు, సాధారణ కొనుగోలుదారులకు ఈ సర్వీసు బిగ్ రిలీఫ్ అందిస్తుంది.
భారం లేకుండా సరదాగా షాపింగ్ చేయొచ్చు :
ఈ బిజినెస్ మోడల్ స్లోగన్ ఒకటే.. ‘మీరు షాపింగ్ చేయండి.. మీ లగేజీని మేం మోస్తాం’ రద్దీగా ఉండే మార్కెట్లలో గంటల తరబడి గడిపే వినియోగదారుల కోసం ఈ సర్వీసును రూపొందించారు. బరువైన సంచుల వల్ల వినియోగదారులు తరచుగా అలసిపోయి త్వరగా వెళ్ళిపోతారు.
ఫలితంగా దుకాణదారులకు నష్టాలు వస్తాయి. ఈ కొత్త సర్వీసు ద్వారా వినియోగదారుల ఇప్పుడు స్వేచ్ఛగా షాపింగ్ చేయొచ్చు. ఎక్కడికంటే అక్కడికి హాయిగా తిరగవచ్చు. తమకు ఇష్టమైన ప్రొడక్టులను కొనేసుకోవచ్చు. ఎలాంటి శారీరక అసౌకర్యం లేకుండా హాయిగా షాపింగ్ ఎంజాయ్ చేయొచ్చు.
In Lajpat, you can now pay ₹149/hr for someone to carry your bags, wait in food queues, walk you to the metro, find you a place to sit, and even set up a foldable chair.
interesting biz !! pic.twitter.com/zS5lmi5E4w
— Khush Mahajan (@YesKhush_5) May 23, 2026
ఈ సర్వీసు ఎలా పనిచేస్తుంది? :
సామాన్య ప్రజల కోసం క్యారీమెన్ ఈ సర్వీసును సరసమైన ధరకే అందిస్తోంది. గంటకు రూ. 149 చెల్లించి ట్రైనింగ్ పొందిన అసిస్టెంట్ బుక్ చేసుకోవచ్చు. వినియోగదారుల సౌలభ్యం కోసం 2, 3, లేదా 4 గంటల వివిధ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఈ అసిస్టెంట్ మార్కెట్ అంతటా వినియోగదారులతో పాటు ఉంటాడు. వారి పని కేవలం షాపింగ్ బ్యాగులు మోయడం మాత్రమే కాదు.. స్టోర్లలో కూడా మీతోనే తిరుగుతారు.
రెస్టారెంట్ల వద్ద లాంగ్ క్యూలు, పార్కింగ్ లేదా మెట్రో స్టేషన్‌కు సేఫ్ గా చేరుకోవడంలో సాయం చేస్తారు. ఒకవేళ వినియోగదారులు అలసిపోతే వారికి సౌకర్యవంతమైన సీటును కూడా ఏర్పాటు చేస్తారు. అయితే, కంపెనీ విధానం ప్రకారం.. ఒక అసిస్టెంంట్ గరిష్టంగా 12 కిలోగ్రాముల బరువును మాత్రమే మోయగలడు. సామాను ఈ పరిమితిని మించి ఉంటే.. వినియోగదారులు అదనపు అసిస్టెంట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ స్టార్టప్ కంపెనీ ఎలా ప్రారంభమైంది? :
ఈ స్టార్టప్ వ్యవస్థాపకులిద్దరూ ఢిల్లీ స్థానికులే. చిన్నప్పటి నుంచి తమ ఫ్యామిలీలతో కలిసి ఈ రద్దీ మార్కెట్లకు వెళ్తూ వచ్చారు. ఎక్కువ దూరం నడక కారణంగా శారీరక అలసట, ఫుడ్ స్టోర్ల వద్ద ఉండే భారీ క్యూ చేతిలోని బరువైన సంచులతో షాపింగ్ చేయడం చాలా కష్టమని భావించారు. ఇక షాపింగ్ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు వారిద్దరూ ఈ స్టార్టప్‌ను స్థాపించారు.
ఏయే మార్కెట్లలో ఉందంటే? :
ఈ ఏడాది ఏప్రిల్‌లో క్యారీమెన్ అధికారికంగా సర్వీసులను ప్రారంభించింది. అయితే, ఫస్ట్ నెలలోనే ఈ స్టార్టప్ 50కి పైగా బుకింగ్‌లు వచ్చాయి. సర్వీసు కోసం ఖరీదైన యాడ్స్ లేదా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ క్యాంపెయిన్ కూడా చేయలేదు. సోషల్ మీడియాలో ఈ కాన్సెప్ట్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది.
ప్రస్తుతం, ఈ సర్వీసు కేవలం లజపత్ నగర్ మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, పెరుగుతున్న డిమాండ్, సానుకూల కస్టమర్ ఫీడ్‌బ్యాక్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సంస్థ త్వరలో చాందినీ చౌక్ వంటి ఇతర మెయిన్ మార్కెట్లకు కూడా విస్తరించనుంది.
