Samsung Galaxy A35 5G : ఫ్లిప్‌కార్ట్ సేల్ ఈరోజే లాస్ట్.. ఈ శాంసంగ్ 5G ఫోన్ అతి తక్కువ ధరకే.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి..!

Samsung Galaxy A35 5G : శాంసంగ్ గెలాక్సీ A35 5G ఫోన్ ధర భారీగా తగ్గింది. ఈ అద్భుతమైన డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..

Samsung Galaxy A35 5G : ఫ్లిప్‌కార్ట్ సేల్ ఈరోజే లాస్ట్.. ఈ శాంసంగ్ 5G ఫోన్ అతి తక్కువ ధరకే.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి..!

Samsung Galaxy A35 5G

Updated On : July 17, 2025 / 5:48 PM IST

Samsung Galaxy A35 5G : ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ మరికొద్దిగంటల్లో (జూలై 17) ముగియనుంది. స్మార్ట్‌ఫోన్లపై డీల్స్ అసలు మిస్ చేసుకోవద్దు. ఈ సేల్ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ A35 5G ఫోన్‌పై  (Samsung Galaxy A35 5G) అతి తక్కువ ధరకే లభిస్తోంది. కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్. ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ A35 5G ఫోన్ రూ. 20వేల లోపు ధరకు అందిస్తోంది. ఈ ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

శాంసంగ్ గెలాక్సీ A35 5G ఫ్లిప్‌కార్ట్ డీల్ :
శాంసంగ్ గెలాక్సీ A35 5G (8GB + 128GB ) వేరియంట్ భారత మార్కెట్లో రూ.30,999కు లాంచ్ అయింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ రూ.11వేలు ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. తద్వారా ధర రూ.19,999కు తగ్గింది. ఇంకా ఎక్కువ సేవింగ్ కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు.

Read Also : Low Cost Smartphones : అద్భుతమైన బ్యాటరీ లైఫ్‌తో అతి తక్కువ ధరకే టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు.. ఏ ఫోన్ కొంటారో మీ ఇష్టం..!

శాంసంగ్ గెలాక్సీ A35 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ A35 5G ఫోన్ ఫుల్ HD+ రిజల్యూషన్, 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. హుడ్ కింద, ఈ గెలాక్సీ ఫోన్ ఎక్సినోస్ 1380 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 8GB LPDDR4X ర్యామ్, 256GB వరకు UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ A25 బ్యాక్ సైడ్ ట్రిపుల్-కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 5MP మాక్రో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరా కూడా ఉంది. ఇంకా, శాంసంగ్ ఫోన్ 25W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5000mAh బ్యాటరీ కలిగి ఉంది.