Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ లవర్స్ కొనాల్సిన ఫోన్.. ఈ గెలాక్సీ S25 అల్ట్రాపై కిర్రాక్ డిస్కౌంట్.. జస్ట్ ధర ఎంతంటే?

Samsung Galaxy S25 Ultra : ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అత్యంత సరసమైన ఈ ఫోన్ చాలా కాలంగా ఫోన్ కొనాలనుకునే వారందరికీ బెస్ట్ ఆప్షన్.. డోంట్ మిస్

Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ లవర్స్ కొనాల్సిన ఫోన్.. ఈ గెలాక్సీ S25 అల్ట్రాపై కిర్రాక్ డిస్కౌంట్.. జస్ట్ ధర ఎంతంటే?

Samsung Galaxy S25 Ultra

Updated On : December 30, 2025 / 8:58 PM IST
  • అడ్వాన్స్ లెవల్ గెలాక్సీ ఏఐ ఫీచర్లు, క్వాడ్ రియర్ కెమెరా సిస్టమ్‌
  • 12GB ర్యామ్ వేరియంట్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌
  • 6.9-అంగుళాల డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ 2X డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
  • 5000mAh బ్యాటరీ, 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌

Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ ఫ్యాన్స్ అద్భుతమైన ఫోన్.. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ 2025 లాంచ్ అయిన అత్యుత్తమ ఫోన్‌లలో ఒకటి. పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ అడ్వాన్స్ లెవల్ గెలాక్సీ ఏఐ ఫీచర్లు, క్వాడ్ రియర్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది.

మీ పాత ఐఫోన్ అప్‌గ్రేడ్ చేసుకోవాలని అనుకుంటే శాంసంగ్ ఔత్సాహికులందరికీ ఫ్లిప్‌కార్ట్ శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాపై అద్భుతమైన డీల్ పొందవచ్చు. ఇంకేమీ ఆలోచించకుండా ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లపై డీల్‌ను ఓసారి పరిశీలిద్దాం..

ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ధర తగ్గింపు :

శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ 12GB ర్యామ్ వేరియంట్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో అసలు లాంచ్ ధర రూ.1,25,999కు బదులుగా రూ.1,07,899కు అందుబాటులో ఉంది.

Samsung Galaxy S25 Ultra

Samsung Galaxy S25 Ultra

ఇంకా, ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ లేదా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేసే యూజర్లందరూ ఈ ఫోన్ రూ.4వేలు అదనపు తగ్గింపు పొందవచ్చు.

Read Also : Best 5G Smartphones : ఈ ఫోన్లు భలే ఉన్నాయి బ్రో.. రూ. 30వేల లోపు బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్లు.. వివో V60e, రియల్‌మి 15 5G వరకు..

అసలు ధర నుంచి రూ.1,03,899కు తగ్గుతుంది. టైటానియం బ్లాక్, టైటానియం గ్రే, టైటానియం, సిల్వర్‌బ్లూ, టైటానియం వైట్‌సిల్వర్ అనే 4 వేర్వేరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా స్పెషిఫికేషన్లు :

శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ 6.9-అంగుళాల డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ 2X డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. శాంసంగ్ 7 మెయిన్ ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లతో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది.

శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో OISతో 200MP ప్రైమరీ షూటర్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 10MP టెలిఫోటో షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ శాంసంగ్ ఫోన్ 12MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. 5000mAh బ్యాటరీతో పాటు 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రన్ అవుతుంది.

ఈ ఫోన్ కొనాలా వద్దా? :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాపై భారీ తగ్గింపు అందిస్తుంది. తక్కువ ధరలో మంచి ఫోన్ కోసం చూస్తుంటే గెలాక్సీ S26 అల్ట్రా కొనడమే బెటర్.