Samsung Galaxy Watch 9 : వాచ్ కొంటే ఇదే కొనాలి.. శాంసంగ్ గెలాక్సీ వాచ్ 9 ఫీచర్లు అదుర్స్.. లాంచ్‌కు ముందే భారీ లీక్!
Samsung Galaxy Watch 9 : శాంసంగ్ గెలాక్సీ వాచ్ 9 ఈ నెల 22న వచ్చేస్తోంది. భారత మార్కెట్లో ఈ శాంసంగ్ వాచ్ ధర, ఇతర ఫీచర్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి..
Samsung Galaxy Watch 9
- ఫాస్ట్ స్పీడ్, బ్యాటరీ లైఫ్ కోసం కొత్త స్నాప్‌డ్రాగన్ చిప్ సెటప్
- ఈ స్మార్ట్‌వాచ్ ఏఐ ఫీచర్లు, ఎక్కువ స్టోరేజ్, మెరుగైన హెల్త్ ట్రాకింగ్
- జూలై 22న గెలాక్సీ వాచ్ 9 సిరీస్‌ను లాంచ్ చేసే అవకాశం
- ధర రూ. 32,999 కన్నా ఎక్కువగా ఉండొచ్చు
Samsung Galaxy Watch 9 : శాంసంగ్ లవర్స్ గెట్ రెడీ.. శాంసంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్ అతి త్వరలో జరగనుంది. ఈ సౌత్ కొరియా టెక్ దిగ్గజం నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లను ఆవిష్కరించనుందని సమాచారం. ఈ ఈవెంట్లో లాంచ్ కానున్న డివైజ్‌లలో గెలాక్సీ వాచ్ 9 సిరీస్ కూడా ఒకటి.
కొత్త లీక్ ప్రకారం.. ఈ వేరబుల్ డివైజ్ కంపెనీ సొంత ఎక్సినోస్ చిప్‌సెట్‌కు బదులుగా క్వాల్కామ్ సరికొత్త స్నాప్‌డ్రాగన్ వేర్ ఎలైట్ ప్రాసెసర్‌తో రానుంది. ఈ కొత్త చిప్సెట్ (Samsung Galaxy Watch 9) ద్వారా ఫాస్ట్ పర్ఫార్మెన్స్, మెరుగైన బ్యాటరీ కెపాసిటీ, ఏఐ ఫీచర్లతో వస్తుందని అంచనా. శాంసంగ్ గెలాక్సీ వాచ్ 9 సిరీస్ సంబంధించి కీలక ఫీచర్లు, ధర వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
డిజైన్, కలర్ ఆప్షన్లు :
లీకైన రెండర్లను పరిశీలిస్తే.. శాంసంగ్ మొత్తం డిజైన్‌ను పాత జనరేషన్ మాదిరిగానే ఉండొచ్చన సూచిస్తున్నాయి. గెలాక్సీ వాచ్ 9 వైట్, నేవీ, ఆలివ్ గ్రీన్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో సిలికాన్ స్పోర్ట్స్ బ్యాండ్లతో వస్తుంది.
స్పెసిఫికేషన్లు (అంచనా) :
రాబోయే శాంసంగ్ గెలాక్సీ వాచ్ 9 సిరీస్ అధికారిక ఫొటోలను టిప్‌స్టర్ షేర్ చేశారు. లీక్ డేటాలో కలర్ ఆప్షన్లు, ఇంటర్నల్ పార్టులతో ఈ వేరబుల్ కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి. లీకుల ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ వాచ్ 9 మోడల్ టీఎస్ఎంసీ 3nm ప్రాసెస్‌పై కొత్త స్నాప్‌డ్రాగన్ వేర్ ఎలైట్ చిప్సెట్తో రన్ అవుతుంది. కొత్త చిప్సెట్తో పాత ఎక్సినోస్ W1000 కన్నా సుమారు 50 శాతం అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ వేరబుల్‌లో స్పెషల్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుందని అంచనా.
Read Also : Best 7-Seaters Cars : ఫ్యామిలీకి సేఫ్, కంఫర్ట్‌కు టాప్.. రూ.10 లక్షల బడ్జెట్లో బెస్ట్ 7-సీటర్ కార్లు!
ఇకపై ఏఐ (AI) పనులు నేరుగా స్మార్ట్వాచ్లోనే పూర్తి చేయొచ్చు. ఏఐ ఫీచర్లలో స్మార్ట్ మెసేజ్ రిప్లయ్, రియల్-టైమ్ ఫిట్నెస్ గైడ్ లైన్స్ వంటివి ఉండొచ్చు. ఈ వాచ్ 2GB మెమరీ, 64GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుందని అంచనా. WearOS7, వన్ యూఐ 9 వాచ్ ఇంటర్ఫేస్తో రన్ అవుతుందని అంచనా.
లీకుల ప్రకారం.. ఈ వేరబుల్ 40mm, 44mm అనే రెండు సైజులలో లభ్యం కానుంది. 40mm మోడల్లో 325mAh బ్యాటరీ, 1.3-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఉంటుంది. 44mm మోడల్లో 445mAh బ్యాటరీ, 1.5-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో వైటల్స్ ట్రాకర్, స్లీప్ అప్నియా మానిటరింగ్, రన్నింగ్ అసిస్టెంట్ ఫీచర్లు ఉండొచ్చు.
లాంచ్ తేదీ :
జూలై 22న జరగనున్న గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో శాంసంగ్ గెలాక్సీ వాచ్ 9, గెలాక్సీ వాచ్ అల్ట్రా 2 లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. ఈ వేరబుల్స్‌తో పాటు నెక్స్ట్ జనరేషన్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను కూడా లాంచ్ చేయనున్నట్టు సమాచారం.
భారత మార్కెట్లో ధర (అంచనా) :
నివేదికల ప్రకారం.. భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ వాచ్ 9 ధర రూ. 32,999 కన్నా కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. అయితే, ఈ వాచ్ అసలు ధర ఎంత అనేది తెలియాలంటే లాంచ్ అయ్యేవరకు ఆగాల్సిందే.
