SBI 180-Day FD : సీనియర్ సిటిజన్లకు పండగే.. ఎస్బీఐ FDపై అదిరిపోయే వడ్డీ.. 180 రోజులకు ఎంత వస్తుందో తెలుసా?
SBI 180-Day FD : ఎస్బీఐ 180 రోజుల ప్రత్యేక ఎఫ్డీ పథకం అమృత్ వర్షితిపై సాధారణ కస్టమర్లకు 6.45 శాతం అత్యధిక వడ్డీ రేటును అందిస్తోంది. పూర్తి వివరాలివే..
SBI 180-Day FD
- ఎస్బీఐలో 180 రోజుల ప్రత్యేక ఎఫ్డీ పథకం
- సీనియర్ సిటిజన్లకు ఎఫ్డీ ఖాతాలపై రాబడి ఎంతంటే?
- 3.05శాతం నుంచి 7.15శాతం వరకు భారీ వడ్డీ రేట్లు
SBI 180-Day FD : సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఎఫ్డీ ఖాతాలపై అత్యధిక వడ్డీ పొందొచ్చు. సాధారణంగా ఎస్బీఐలో అతిపెద్ద కస్టమర్ బేస్ మాత్రమే కాదు.. అత్యధిక సంఖ్యలో బ్రాంచులు కూడా ఉన్నాయి.
అంతేకాదు.. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా కూడా దేశంలోనే అతిపెద్ద బ్యాంకు.. అలాంటి ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్ (FD) ఖాతాలపై అద్భుతమైన (SBI 180-Day FD) వడ్డీ రేట్లను అందిస్తోంది. మీరు సీనియర్ సిటిజన్లు అయితే, 180-రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలపై అందించే వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి? సీనియర్ సిటిజన్లు తమ ఎఫ్డీ ఖాతాలపై ఎంత మొత్తంలో రాబడిని పొందుతారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఎస్బీఐలో 180 రోజుల ఎఫ్డీపై వడ్డీ? :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వివిధ కాలపరిమితులతో కూడిన ఫిక్స్డ్ డిపాజిట్ (FD) పథకాలపై 3.05శాతం నుంచి 7.15శాతం వరకు అద్భుతమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కనీసం 7 రోజుల నుంచి గరిష్టంగా 10 ఏళ్ల కాలపరిమితితో ఎఫ్డీ ఖాతాను ఓపెన్ చేయొచ్చు. ఎస్బీఐలో 180 రోజుల ఎఫ్డీ పథకాలపై 5.65శాతం నుంచి 6.25శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది.
Read Also : D2M TV on Phone : ఇంటర్నెట్, డేటాతో పనిలేదు.. మీ ఫోన్లోనే లైవ్ టీవీ చూడొచ్చు.. త్వరలో D2M సేవలు?
సీనియర్ సిటిజన్లకు ఎంత రాబడి? :
ఎస్బీఐ 59 ఏళ్ల వయస్సు లోపు ఉన్న కస్టమర్లకు 180 రోజుల FD ఖాతాలపై 5.65 శాతం వడ్డీని అందిస్తోంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న కస్టమర్లకు 180 రోజుల FD పథకాలపై 6.15 శాతం వడ్డీని అందిస్తోంది. అదనంగా, 80 ఏళ్లు, ఆపై ఎక్కువ వయస్సు ఉన్న కస్టమర్లకు 180 రోజుల ఎఫ్డీ ఖాతాలపై 6.25 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ ఎస్బీఐ ఎఫ్డీ పథకంలో గరిష్టంగా రూ. 2,999,999 వరకు జమ చేసుకోవచ్చు.
సీనియర్ సిటిజన్లకు ప్రయోజనాలేంటి? :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సాధారణ కస్టమర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు ఎఫ్డీ ఖాతాలపై 0.50 శాతం అధిక వడ్డీని అందిస్తోంది. అంతేకాదు.. సూపర్ సీనియర్ సిటిజన్లకు అంటే.. 80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి, సాధారణ సీనియర్ సిటిజన్ల కన్నా 0.10 శాతం అధిక వడ్డీని చెల్లిస్తోంది. ఎస్బిఐ 444 రోజుల ప్రత్యేక ఎఫ్డీ పథకం ‘అమృత్ వర్షితి’పై సాధారణ కస్టమర్లకు అత్యధికంగా 6.45 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
