SBI FD Scheme : సీనియర్ సిటిజన్లకు పండగే.. SBI FDపై అదిరే వడ్డీ.. 6 నెలలకు డబుల్ బెనిఫిట్!
SBI Fixed Deposit : సీనియర్ సిటిజన్ల కోసం ఎస్బీఐలో 6 నెలల FDపై అద్భుతమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. సాధారణ కస్టమర్లకు 5.65శాతం, సీనియర్ సిటిజన్లకు 6.15శాతం, సూపర్ సీనియర్లకు 6.25శాతం వడ్డీ పొందవచ్చు. లేటెస్ట్ రేట్లు, బెనిఫిట్స్ ఇవే
SBI FD Scheme
- SBI FDపై అదిరే వడ్డీ.. సీనియర్ సిటిజన్లకు మరింత బెనిఫిట్
- 6 నెలలు డబ్బు పెడితే ఎంత వస్తుంది? SBI FD వడ్డీ రేట్లు ఇవే
- రూ.3 కోట్లలోపు FDలకు SBI వడ్డీ రేట్లు.. ఎవరికెంత?
SBI FD Scheme : ఎస్బీఐలో FD చేశారా? ఇప్పుడు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల కోసం అనేక టెన్యూర్లతో ఫిక్స్డ్ డిపాజిట్ల (FD)పై భారీ వడ్డీ రేట్లను అందిస్తోంది.
ముఖ్యంగా, సాధారణ కస్టమర్లతో పోలిస్తే.. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు అధిక వడ్డీ రేట్లను పొందవచ్చు. మీరు ఎస్బీఐలో 6 నెలల FD తీసుకోవాలని భావిస్తుంటే ఇది మీకోసమే.. మీ ఫిక్స్డ్ డిపాజిట్లు మెచ్యూరిటీ సమయంలో అసలు మొత్తం, వడ్డీతో పాటు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
12 నెలల FDపై ఎస్బీఐ వడ్డీ ఎంతంటే? :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ వయసుల కస్టమర్లకు 6 నెలల FDలపై వేర్వేరు వడ్డీ రేట్లను అందిస్తోంది. 59 ఏళ్ల వయస్సు వరకు ఉన్న కస్టమర్లకు 6 నెలల ఎఫ్డీలపై బ్యాంక్ 5.65శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది.
60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న కస్టమర్లకు 6 నెలల ఎఫ్డీలపై 6.15శాతం వడ్డీని అందిస్తోంది.అంటే, సాధారణ కస్టమర్ల కన్నా సీనియర్ సిటిజన్లు 0.50శాతం ఎక్కువ వడ్డీని పొందవచ్చు. 80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సూపర్ సీనియర్ సిటిజన్లకు 6 నెలల FDలపై 6.25శాతం వడ్డీని అందిస్తోంది.
రూ. 3 కోట్ల వరకు FDలపై వర్తింపు :
ఈ వడ్డీ రేట్లు రూ. 3 కోట్ల కన్నా తక్కువ డిపాజిట్ల FDలకు వర్తిస్తాయి. మీరు FD చేసే ముందు, బ్యాంకు ప్రస్తుత వడ్డీ రేట్లు, నిబంధనలను తప్పకుండా చెక్ చేయండి. ఎందుకంటే.. బ్యాంకులు ఈ రేట్లను ఎప్పటికప్పుడు మార్చుతుంటాయి.
ఎస్బీఐ లాస్ట్ వడ్డీ రేట్లు సవరణ :
ఎస్బీఐ ఎఫ్డీ వడ్డీ రేట్లను చివరిసారిగా డిసెంబర్ 2025లో సవరించింది. అప్పటి నుంచి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) వడ్డీ రేట్లలో ఎలాంటి పెద్ద మార్పులు చేయలేదు. డిసెంబర్ 2025 నుంచి ఎస్బీఐ ఎఫ్డీ వడ్డీ రేట్లు చాలా వరకు స్థిరంగానే ఉన్నాయి.
అందుకే మీరు ఎస్బీఐలో ఎఫ్డీ పెట్టాలని ప్లాన్ చేస్తుంటే.. ప్రస్తుత వడ్డీ రేట్లను తప్పకుండా చెక్ చేసుకోండి. బ్యాంక్ ఎఫ్డీ రేట్లను ఎప్పటికప్పుడు సవరిస్తుంది. పెట్టుబడి పెట్టే ముందు కొత్త రేట్లు, వివిధ టెన్యూర్ ఆప్షన్లు ఏంటో తెలుసుకోవడం ఎంతైనా మంచిది.
