Credit Card Rules : క్రెడిట్ కార్డు హోల్డర్లకు బిగ్ షాక్.. జూలై 1 నుంచి కొత్త రూల్స్.. కార్డు గీకితే జేబుకే చిల్లు..!
Credit Card New Rules : మీరు ఎస్బీఐ లేదా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? జూలై 1, 2026 నుంచి క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లు, ఛార్జీలకు సంబంధించిన రూల్స్ మారనున్నాయి.
Credit Card New Rules
- జూలై 1 నుంచి కొత్త క్రెడిట్ కార్డు నిబంధనలు మారుతున్నాయ్
- రివార్డు పాయింట్ల నిబంధనల్లో మార్పులు
- కొత్త పేమెంట్లపై ఛార్జీలు, రుసుములు వర్తింపు
Credit Card New Rules : మీకు క్రెడిట్ కార్డు ఉందా? ఏ బ్యాంకు క్రెడిట్ కార్డు వాడుతున్నారు? మీ దగ్గర ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులు ఉన్నాయా? అయితే, మీకో షాకింగ్ న్యూస్.. జూలై 1, 2026 నుంచి కొత్త క్రెడిట్ కార్డు రూల్స్ అమల్లోకి రానున్నాయి.
క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు కార్డుల నిబంధనలు పూర్తిగా మారనున్నాయి. బ్యాంకులు రివార్డ్ పాయింట్లు, లావాదేవీల (Credit Card Rules) రుసుములు, ఇతర ఛార్జీలలో భారీగా మార్పులు చేశాయి. ఈ కొత్త నిబంధనలకు సంబంధించి ముందుగానే తెలియకపోతే భారీగా నష్టపోతారు జాగ్రత్త.. ఇంతకీ నిబంధనలేంటి? మీరు ఏం చేయాలి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
రివార్డ్ పాయింట్ల నిబంధనల మార్పు :
కొత్త నిబంధనలకు అనుగుణంగా, బ్యాంకులు ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులకు రివార్డ్ పాయింట్ల విధానాన్ని పూర్తిగా మార్చాయి. గతంలో భారీ రివార్డ్ పాయింట్లు అందించిన లావాదేవీలపై ఇప్పుడు పరిమితి విధించారు. అలాగే, యుటిలిటీ బిల్లులు, బీమా ప్రీమియంలు, కొన్ని ఆన్లైన్ పేమెంట్లపై వచ్చే రివార్డ్ పాయింట్లను భారీగా తగ్గించాయి బ్యాంకులు.
Read Also : LPG e-KYC : గ్యాస్ వినియోగదారులకు అర్జెంట్ అలర్ట్.. జూన్ 30లోపు ఈ ఒక్క పనిచేయకపోతే సబ్సిడీ రాదు?
కొత్త లావాదేవీలపై ఛార్జీలు, రుసుములు :
క్రెడిట్ కార్డులతో పేమెంట్లు చేయడం ఇక మరింత ఖరీదైనది కానుంది. జూలై ఒకటో తేదీ నుంచి థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా చేసే రెంట్ పేమెంట్లు, అదనపు రుసుములు వర్తించనున్నాయి. ఆన్లైన్ వాలెట్లను లోడ్ చేయడం, స్కూల్, కాలేజీల ఫీజులు చెల్లించడం, కొన్ని వ్యాపార లావాదేవీలకు కూడా బ్యాంకులు కొత్త ఛార్జీలను విధించనున్నాయి. కొన్ని లావాదేవీలకు ఈఎంఐ ఎక్స్ఛేంజ్ రుసుములను కూడా సవరించారు.
ఈ కొత్త మార్పులతో సగటు క్రెడిట్ కార్డ్ యూజర్లు నెలవారీ బడ్జెట్, సేవింగ్స్‌పై నేరుగా ఎఫెక్ట్ పడుతుంది. అంతేకాదు.. విమానాశ్రయ లాంజ్ యాక్సెస్ రూల్స్ కూడా కఠినతరం చేస్తున్నారు. ఇకపై ఫ్రీ లాంజ్ యాక్సెస్ కోసం ప్రతి త్రైమాసికంలో నిర్దిష్ట మొత్తాన్ని ఖర్చు చేయక తప్పదు. జూలై ఒకటో తేదీలోగా మీ బ్యాంక్ అధికారిక గైడ్ లైన్స్ తప్పకుండా చెక్ చేసుకోండి.
