Summer AC Tips : మీ ఇంట్లో AC నుంచి వాటర్ లీక్ అవుతుందా? అసలు కారణాలివే.. ఎలా ఫిక్స్ చేయాలంటే?
Summer AC Tips : ఏసీ ఇండోర్ యూనిట్ నుంచి నీరు కారడం అనేది చాలా కామన్. ఇన్స్టాలేషన్ సమస్యల నుంచి డ్రైనేజీ సిస్టమ్ మూసుకుపోవడం వరకు వివిధ కారణాల వల్ల ఏసీ నుంచి వాటర్ లీక్ అవుతుంటుంది..
Summer AC Tips ( Image Credit : Generated by AI )
- మీ ఇంట్లో ఏసీ నుంచి నీరు పదేపదే లీక్ అవుతుందా?
- ఏసీ నుంచి వాటర్ లీక్ అవ్వడానికి కారణాలంటో తెలుసా?
- ఏసీలోని ఫిల్టర్లు దుమ్ము, ధూళి కారణంగా వాటర్ లీక్ అవ్వొచ్చు
Summer AC Tips : అసలే ఎండాకాలం.. ఇంట్లో ఏసీ లేదా కూలర్ తప్పనిసరిగా ఉండాల్సిందే. కాసేపు ఏసీ ఆఫ్ చేసినా ఎండ వేడిమికి ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటారు. ఈ సమ్మర్ సీజన్ సమయంలో ఏసీలు కండిషన్ లో ఉండాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు.
మీ ఇంట్లో ఏసీ సరిగా పనిచేస్తుందా? ఎందుకంటే..వేసవిలో ఏసీ అవసరం లేని రోజు ఒక్కటి కూడా ఉండదు. నిరంతర వాడకం వల్ల, చాలా సార్లు ఏసీలో సమస్యలు వస్తాయి. అలాంటి సాధారణ సమస్య ఏసీ నుంచి నీరు కారడం. కొన్నిసార్లు ఏసీ ఇండోర్ యూనిట్ నుంచి వాటర్ డ్రాప్స్ కారడం మొదలవుతుంది.
ఇలా జరిగినప్పుడు ఏసీని వాడటం చాలా కష్టమవుతుంది. కొంతసేపు వాడిన తర్వాత ఇల్లంతా నీటితో తడిసిపోతుంది. మీ ఏసీ నుంచి కూడా ఇలానే నీరు కారుతుంటే.. ఆ యూనిట్‌కు ఇప్పుడు రిపేర్ తప్పనిసరి. అసలు ఏసీ నుంచి నీరు కారడానికి గల కారణాలేంటి? ఎలా ఈ సమస్యను నివారించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఏసీ నుంచి నీరు ఎందుకు కారుతుందంటే? :
ఎయిర్ ఫిల్టర్ అడ్డుపడటం :
మీ ఏసీలోని ఫిల్టర్లు దుమ్ము, ధూళి కారణంగా మురికిగా అవుతాయి. వెంటనే క్లీన్ చేయకపోతే అవి మూసుకుపోవచ్చు. ఇలా మూసుకుపోయిన ఫిల్టర్ ఎయిర్ ఫ్లోను ఆపేస్తుంది. తద్వారా ఎవాపరేటర్ కాయిల్‌ను రెండింటినీ దెబ్బతీస్తుంది. ఫలితంగా ఇండోర్ యూనిట్ నుంచి వాటర్ లీక్ కావచ్చు. అందుకే ఎయిర్ ఫిల్టర్‌ను క్రమం తప్పకుండా క్లీన్ చేయాలి.
ఇన్స్టాలేషన్ లోపాలు :
మీరు కొత్త ఏసీని వాడుతుంటే.. అందులో నుంచి నీరు కారుతుంటే ఆ సమస్య ఇన్స్టాలేషన్ లోపం వల్ల కావచ్చు. ఇన్స్టాలేషన్ సమయంలో జరిగే చిన్న పొరపాటు కూడా వాటర్ లీకేజీకి కారణం కావచ్చు. అందుకే మీ ఏసీని ఎల్లప్పుడూ ఒక టెక్నీషియన్‌తో ఇన్స్టాల్ చేయించండి. కొత్త ఏసీలో వాటర్ లీకేజీకి ఎక్కువ ఇన్స్టాలేషన్ లోపాలే కారణమవుతాయి.
పగిలిన డ్రెయిన్ పైపు :
ఏసీలో జనరేట్ అయ్యే నీటిని బయటకు పంపేందుకు డ్రెయిన్ పైపును వాడుతారు. ఈ పైపు పగిలిపోయినా లేదా మూసుకుపోయినా బయటకు వెళ్లాల్సిన నీరు ఇంట్లోకి వస్తుంది. మీరు దీన్ని ఈజీగా చెక్ చేయవచ్చు. ఏసీని వాడే సమయంలో డ్రెయిన్ పైపు నుంచి నీరు బయటకు రాకపోతే అది పాడై ఉండవచ్చు. దీనికి ఒక టెక్నీషియన్‌ను పిలిచి కొత్తది మార్పించుకోవడమే సులభమైన పరిష్కారం.
బూజు సమస్యలు :
తేమ కొన్నిసార్లు ఇండోర్ యూనిట్లలో బూజు పెరుగుతుంది. తద్వారా ఎయిర్ ఫ్లోను అడ్డుకుంటుంది. కొన్ని సందర్భాల్లో డ్రైనేజీ సిస్టమ్ మూసుకుపోయేలా చేస్తుంది. డ్రైనేజీ సిస్టమ్ క్లోజ్ అయితే వాటర్ బయటకు లీక్ అయి ఇతర ప్రదేశాలకు కూడా చేరుతుంది. దీన్ని నివారించేందుకు మీ ఏసీకి క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించండి.
