Gold: అధిక లాభాల కోసం కొత్తగా బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? ఈ సింపుల్ టిప్స్ మీకోసమే..

బంగారం పెట్టుబడుల నుంచి మీ డబ్బును తిరిగి తీసుకోవడానికి మీరు ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం కూడా ఉండదు.

Gold: అధిక లాభాల కోసం కొత్తగా బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? ఈ సింపుల్ టిప్స్ మీకోసమే..

బంగారం ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇతర మార్కెట్ల గురించి చాలా మందికి తెలియదు. బంగారం మన వద్ద ఉంటే భవిష్యత్తుకు భరోసా ఉన్నట్లే. బంగారంపై పెట్టుబడులు ద్రవ్యోల్బణ ఉపద్రవం నుంచి కాపాడతాయి. ఇతర రంగాలతో పోల్చితే స్థిరంగా ధరలు పెరుగుతూ పోయే బంగారంపై పెట్టుబడులు పెట్టాలని చాలా మంది భావిస్తారు.

బంగారానికి మార్కెట్‌లో భారీగా గిరాకీ ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో మీకు ఆర్థికంగా ఎంతగానో తోడ్పడుతుంది.  బంగారం పెట్టుబడుల నుంచి మీ డబ్బును తిరిగి తీసుకోవడానికి మీరు ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం కూడా ఉండదు.

  • బంగారంలో పెట్టుబడులు మూడు రకాలుగా ఉంటాయి. వాటిలో మొదటిది ఫిజికల్ గోల్డ్- ఆభరణాలు, నాణేలు, గోల్డ్ బార్ల వంటివి. రెండోది డిజిటల్ గోల్డ్- పేటీఎం, గూగుల్ పే వంటి మొబైల్ వాలెట్ల ద్వారా కొనుగోలు చేసే పసిడి. మూడోది పేపర్ గోల్డ్- గోల్డ్ బాండ్లు, ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ వంటివి.
  • ఈక్విటీ లేదా బాండ్ ఇన్వెస్ట్‌మెంట్‌లా కాకుండా బంగారంలో పెట్టుబడి పెట్టడానికి లోతైన మార్కెట్ పరిజ్ఞానం అవసరం లేదు. ఎవరైనా బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు.
  • బంగారం విక్రయాలను పెంచుకోవడానికి చాలా మంది వ్యాపారులు మంచి స్కీంలను అందిస్తున్నారు. వారు అందించే సాధారణ గోల్డ్ సేవింగ్స్ ప్లాన్‌లో నిర్ణీత వ్యవధిలో ప్రతి నెలా కొంత మొత్తాన్ని డిపాజిట్ చేస్తూ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.
  • బంగారు నాణేలు, బులియన్ లేదా ఆభరణాలను కొనుగోలు చేయడం వంటివి బంగారంలో పెట్టుబడి పెట్టడానికి సులభమైన మార్గం. మీరు వీటిని బంగారం రిటైలర్ వద్ద పొందవచ్చు.
  • బంగారంలో సాధారణ పెట్టుబడులకు ప్రత్యామ్నాయంగా డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్‌లను వాడుకోవచ్చు. డిజిటల్ బంగారంలో పెట్టుబడులు పెట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా జారీ చేయబడిన గోల్డ్ సావరిన్ బాండ్లు అత్యుత్తమం.

Mitsubishi Comeback India : భారత్‌కు మళ్లీ ‘మిత్సుబిషి’ బ్రాండ్ వస్తోంది.. 30శాతం వాటా కొనుగోలుతో రీఎంట్రీకి రెడీ!