TVS Ronin Sales : కొత్త బైక్ కొంటున్నారా? TVS నుంచి సరికొత్త బైక్ వస్తోంది.. కేఫ్ రేసర్ వేరియంట్ ఫీచర్లు, ధర వివరాలు
TVS Ronin Sales : టీవీఎస్ రోనిన్ బైక్ సేల్స్ దుమ్మురేపాయి. ఈ బైక్‌ను ఫిబ్రవరిలో ఏకంగా 8వేల మంది కొనేందుకు క్యూకట్టారు. ఇప్పుడు టీవీఎస్ కొత్త రేసర్ వెర్షన్‌ను కూడా లాంచ్ చేయనుంది. పూర్తి వివరాలివే..
TVS Cafe Racer Variant
- గత ఫిబ్రవరిలో 8వేలకు పైగా టీవీఎస్ రోనిన్ బైక్ కొనేశారు
- 2025లో 4వేల నుంచి 5 వేల యూనిట్లతో మొదలైన సేల్స్
- త్వరలో కొత్త కేఫ్ రేసర్ వెర్షన్ బైక్ రాబోతుంది
TVS Ronin Sales : కొత్త బైక్ కొనేందుకు చూస్తున్నారా? టీవీఎస్ నుంచి సరికొత్త బైక్ రాబోతుంది. ఇప్పటికే టీవీఎస్ రోనిన్ బైకుకు మార్కెట్లో ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. మార్కెట్ పెరగడంతో కంపెనీ సరికొత్త మోడల్ బైకును కూడా తీసుకురాబోతుంది. 2026 ఫిబ్రవరిలో టీవీఎస్ రోనిన్ బైక్‌ను 8వేల మందికి పైగా కొనుగోలు చేశారు.
ఇప్పుడు, ఈ పవర్ఫుల్ బైక్ కొత్త కేఫ్ రేసర్ వెర్షన్‌ను కంపెనీ ప్రవేశపెట్టనుంది. కంపెనీ ఇటీవలే డిజైన్ పేటెంట్‌ను దాఖలు చేసింది. టీవీఎస్ రోనిన్ మార్కెట్లో సత్తా చాటుతోంది. గత ఏడాది కాలంలో ఈ బైక్ అమ్మకాలు భారీగా పెరిగాయి.
2025 ప్రారంభంలో సుమారు 4వేల నుంచి 5వేల యూనిట్లుగా ఉన్న అమ్మకాలు ఇప్పుడు ఏకంగా 8వేలు యూనిట్లను దాటాయి. బైకు వినియోగదారులు ఈ టీవీఎస్ రోనిన్ బైకును కొనేందుకు ఎగబడుతున్నారు. కొద్దికాలంలోనే ఈ టీవీఎస్ రోనిన్ బైక్ భారీగా పాపులర్ అయింది. పూర్తి ఫీచర్ల వివరాలపై ఓసారి వివరంగా పరిశీలిద్దాం..
కొత్త కేఫ్ రేసర్ వెర్షన్ డిజైన్ :
మార్కెట్లో ఈ బైకులకు భారీ డిమాండ్ పెరగడంతో టీవీఎస్ మోటార్ కంపెనీ ఇప్పుడు రోనిన్ రేంజ్ విస్తరించేందుకు రెడీ అవుతోంది. కంపెనీ ఇటీవలే రోనిన్ కొత్త కేఫ్ రేసర్ వెర్షన్ కోసం డిజైన్ పేటెంట్‌ను దాఖలు చేసింది. అతి త్వరలో ఈ కొత్త బైకును మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉంది.
స్పోర్టీ, స్టైలిష్ ఫీచర్లు :
డిజైన్ పరంగా చూస్తే.. టీవీఎస్ రోనిన్ కేఫ్ రేసర్ స్టాండర్డ్ మోడల్ కన్నా చాలా స్పోర్టీగా స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఇందులో కొత్త క్వార్టర్ ఫెయిరింగ్, తక్కువ ఎత్తులో ఉండే క్లిప్-ఆన్ హ్యాండిల్బార్లు, బ్యాక్ సైడ్ అమర్చిన ఫుట్‌పెగ్‌లు ఉన్నాయి. సింగిల్ సీట్, షార్ట్ ఎగ్జాస్ట్ వంటి అంశాలు క్లాసిక్ కేఫ్ రేసర్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి.
గతంలో కన్నా మెరుగైన ఫీచర్లు :
ఫీచర్ల పరంగా చూస్తే.. మధ్యలో గుండ్రని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. సాధారణ రోనిన్ కన్నా వేరుగా ఉంటుంది. టైర్లు, గ్రాఫిక్స్ కూడా మరింత స్పోర్టీగా ఉంటాయి. రోడ్డుపై అద్భుతమైన ఫీచర్లతో దూసుకుపోనుంది.
పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే? :
పర్ఫార్మెన్స్ పరంగా ఈ కొత్త వెర్షన్లో 20.4 PS పవర్, 19.93 Nm టార్క్ ఉత్పత్తి చేసే అదే 225.9cc ఇంజన్‌తో వస్తుందని భావిస్తున్నారు. అయితే, సస్పెన్షన్, రైడింగ్ డైనమిక్స్‌లో కొన్ని మార్పులతో ఈ బైక్ మరింత స్టేబుల్, స్పోర్టీగా మారుతుందని అంచనా.
లాంచ్ ఎప్పుడంటే? :
కంపెనీ ఇంకా అధికారికంగా లాంచ్ తేదీని ప్రకటించలేదు. రోనిన్ కేఫ్ రేసర్ భారత మార్కెట్లోకి ఎప్పుడైనా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
