Vodafone Idea Plans : వోడాఫోన్ ఐడియా ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో ప్రీపెయిడ్ ప్లాన్‌లివే.. ధర, వ్యాలిడిటీ వివరాలివే!

Vodafone Idea Plans : వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్‌లు ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందేందుకు కొనుగోలు చేయగల రెండు రీఛార్జ్ ప్లాన్‌లు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ బండిల్ ప్రారంభ ధర రూ. 998కు పొందవచ్చు.

Vodafone Idea Plans : వోడాఫోన్ ఐడియా (Vi) యూజర్లకు గుడ్ న్యూస్.. ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ అందించే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్‌ని కూడా ఆఫర్ చేస్తోంది. ప్రీపెయిడ్ రీఛార్జ్‌లతో ప్లాన్ వ్యాలిడిటీని అందిస్తోంది. రోజువారీ ఇంటర్నెట్ డేటా బ్యాలెన్స్, ఫ్రీ అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఫ్రీ ఎస్ఎంఎస్ సహా సాధారణ టెలికాం బెనిఫిట్స్ సహా ప్లాన్‌లను అందిస్తోంది. ముఖ్యంగా, గత ఏడాదిలో టెలికాం ఆపరేటర్లు ఎయిర్‌టెల్, జియో కూడా తమ సంబంధిత సబ్‌స్క్రైబర్‌ల కోసం ఇలాంటి నెట్‌ఫ్లిక్స్ రీఛార్జ్ ప్లాన్‌లను ప్రకటించింది.

Read Also : Nothing Phone 2a Special Edition : నథింగ్ ఫోన్ 2ఎ స్పెషల్ ఎడిషన్ ఇదిగో.. కలర్ ఫుల్ డిజైన్ అదుర్స్.. ధర ఎంతో తెలుసా?

ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో ప్రీపెయిడ్ ప్లాన్.. ధర, వ్యాలిడిటీ :
వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్‌లు ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందేందుకు కొనుగోలు చేయగల రెండు రీఛార్జ్ ప్లాన్‌లు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ బండిల్ ప్రారంభ ధర రూ. 998కు పొందవచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్, రోజుకు 1.5జీబీ డేటా, 70 రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.

ఈ ప్లాన్ గుజరాత్, ముంబై మినహా అన్ని సర్కిల్‌లలో అందుబాటులో ఉంది. గుజరాత్, ముంబైలోని వినియోగదారులు అదే ఆఫర్ ధర రూ. 1,099కు అందిస్తోంది. రెండో రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 1,399కు పొందవచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్, రోజుకు 2.5జీబీ డేటా, 84 రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.

ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు :
ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ కలిగిన వినియోగదారులు ఇంకా నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ క్రియేట్ చేయని వినియోగదారులు ఇద్దరూ ఈ ప్లాన్‌కు అర్హులు. రీఛార్జ్ పూర్తయిన తర్వాత, వినియోగదారులు విఐ యాప్‌ని ఓపెన్ చేసి ప్లాన్ బెనిఫిట్స్ పేజీకి వెళ్లాలి. నెట్‌ఫ్లిక్స్‌పై క్లిక్ చేసిన తర్వాత వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్ యాప్ లేదా వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అవుతారు. లింక్ చేయడం ద్వారా కొత్త అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పటికే ఉన్న అకౌంట్ కూడా లింక్ చేయవచ్చు.

ఒకవేళ యూజర్లు ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ ప్లాన్‌కు సభ్యత్వం పొందినట్లయితే.. వారి అకౌంట్ లింక్ చేయడం వల్ల ప్రస్తుత సభ్యత్వం పాజ్ అవుతుంది. ఆటోమాటిక్‌గా విఐ ప్లాన్ ప్రారంభమవుతుంది. అయితే, ఒక యూజర్ ఆపిల్ ద్వారా నెట్‌ఫ్లిక్స్‌కు సభ్యత్వాన్ని పొందితే.. ముందుగా సభ్యత్వాన్ని రద్దు చేయాలి. లేకపోతే, వారు ఇప్పటికీ ఆపిల్ ద్వారా ఛార్జ్ చేయొచ్చు. రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ ముగిసిన తర్వాత యూజర్ గతంలో పేమెంట్ మెథడ్ మారవచ్చు. నెట్‌ఫ్లిక్స్ ఎక్స్‌పీరియన్స్‌కు అంతరాయం ఉండదు. ఇతర పేమెంట్ మెథడ్ అకౌంట్ హోల్డ్‌లో ఉంటుంది.

వినియోగదారులు ప్లాన్‌ను మాన్యువల్‌గా ఎంచుకోవడానికి పేమెంట్ మెథడ్ యాడ్ చేసి నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ పేజీని విజిట్ చేయొచ్చు. ఈ ఆఫర్ మినహా నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ ధర రూ. 199కు పొందవచ్చు. గరిష్టంగా 720పీ వీడియో రిజల్యూషన్‌తో వస్తుంది. ఒకేసారి ఒక ఇంటి డివైజ్‌లో వీక్షించవచ్చు. ఈ ప్లాన్ టీవీ, కంప్యూటర్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లతో సహా అన్ని డివైజ్‌లకు సపోర్టు ఇస్తుంది. ఆఫ్‌లైన్ వ్యూ కోసం ఏదైనా ఒక డివైజ్‌లో కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా ఈ ప్లాన్ యూజర్లను అనుమతిస్తుంది.

Read Also : TATA IPL 2024 : ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో 62 కోట్లకుపైగా వ్యూస్‌తో జియోసినిమా సరికొత్త రికార్డు..!

ట్రెండింగ్ వార్తలు