Trump Gold Card : అమెరికా వెళ్లేందుకు సువర్ణావకాశం.. ట్రంప్ గోల్డ్ కార్డ్ వచ్చేసింది.. ధర ఎంత? ఎవరు అర్హులు? ఎలా అప్లయ్ చేయాలంటే? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!

Trump Gold Card : అమెరికా వలస వెళ్లాలని అనుకుంటున్నారా? ట్రంప్ గోల్డ్ కార్డ్ ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్‌ మీకోసమే.. ఈ వీసా ఉంటే అమెరికా పౌరసత్వం పొందవచ్చు.. ఎలా అప్లయ్ చేయాలంటే?

Trump Gold Card : అమెరికా వెళ్లేందుకు సువర్ణావకాశం.. ట్రంప్ గోల్డ్ కార్డ్ వచ్చేసింది.. ధర ఎంత? ఎవరు అర్హులు? ఎలా అప్లయ్ చేయాలంటే? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!

Trump Gold Card

Updated On : December 11, 2025 / 3:46 PM IST

Trump Gold Card : అమెరికాలో స్థిరపడాలని కలలు కనేవారికి భారీ శుభవార్త. దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ‘ట్రంప్ గోల్డ్ కార్డ్’ అనే కొత్త వీసా ప్రొగ్రామ్ ప్రారంభించారు. ఈ వీసా కార్డు ద్వారా అమెరికన్ పౌరసత్వాన్ని నేరుగా పొందవచ్చు.

ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ట్రంప్ గోల్డ్ కార్డ్ (Trump Gold Card) వచ్చేసింది.. ఇప్పుడు, అర్హత కలిగిన వెరిఫైడ్ వీసాదారులు నేరుగా యూఎస్ పౌరసత్వాన్ని పొందవచ్చు అంటూ పోస్టు చేశారు. ఈ గోల్డ్ కార్డ్ అమెరికాలో స్థిరపడటానికి భవిష్యత్తులో పౌరసత్వం పొందే అవకాశాన్ని పొందవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభతో పాటు ప్రధాన పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు అమెరికా ఈ కొత్త ప్రొగ్రామ్ అందుబాటులోకి తీసుకొచ్చింది.

ట్రంప్ గోల్డ్ కార్డ్ అంటే ఏంటి? :
సెప్టెంబర్‌లో జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా ఈ కార్యక్రమం ఇప్పుడు అధికారికంగా అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఇందులో రెండు వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి. గోల్డ్ కార్డ్ అనేది అమెరికాకు సొంతంగా ప్రయాణించాలనుకునే వ్యక్తుల కోసం అందుబాటులో ఉంటుంది. కార్పొరేట్ గోల్డ్ కార్డ్ అనేది ఏదైనా కంపెనీ తమ ఉద్యోగులను అమెరికాకు పంపాలనుకునేందుకు ఉపయోగపడుతుంది. త్వరలో ప్లాటినం కార్డ్ కూడా అందుబాటులోకి రానుంది. ఈ కార్డు ద్వారా అమెరికాలో 270 రోజులు ఉండేందుకు అనుమతి ఉంటుంది.

Read Also : Noida Apple Store : నోయిడాలో ఫస్ట్ ఆపిల్ స్టోర్ ప్రారంభం.. ఐఫోన్ 17, మ్యాక్‌బుక్ సహా మరెన్నో ప్రొడక్టులు.. కస్టమర్ల విజిట్ టైమ్ ఇదే..!

గోల్డ్ కార్డ్ ధర ఎంతంటే? :
ఈ గోల్డ్ కార్డ్ పొందడం అత్యంత ఖరీదైనది. కానీ, అమెరికా పౌరసత్వం కోరుకునే వారికి బెస్ట్ ఆప్షన్.
ట్రంప్ గోల్డ్ కార్డ్ : దరఖాస్తు కోసం 15,000 డాలర్లు (సుమారు రూ. 12.5 లక్షలు) డిపాజిట్ చేయాలి. ఈ మొత్తం రీఫండ్ పొందలేరు. దరఖాస్తు అప్రూవల్ వచ్చిన తర్వాత, 1 మిలియన్ డాలర్ (సుమారు రూ. 9 కోట్లు) ఒకేసారి గిఫ్ట్ పేమెంట్ చేయాలి.

కార్పొరేట్ గోల్డ్ కార్డ్ : ఉద్యోగి అప్లయ్ చేసుకునే సంస్థ ముందుగా 15వేల డాలర్లతో దరఖాస్తు రుసుము చెల్లించాలి. అప్రూవల్ తర్వాత కంపెనీ 2 మిలియన్ డాలర్లు లేదా దాదాపు రూ.16.6 కోట్ల గిఫ్ట్ పేమెంట్ చేయాలి.

అప్లయ్ చేసేందుకు లాస్ట్ డేట్ ఎప్పటివరకంటే? :
గోల్డ్ కార్డు వెబ్‌సైట్‌లో ఇంకా అప్లికేషన్ గడువు తేదీ ఎప్పటివరకూ అనేది పేర్కొనలేదు. ప్రస్తుతానికి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. కానీ, ఏడాది పొడవునా లేదా పరిమిత సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయా అనేది క్లారిటీ లేదు.

అప్లికేషన్ ప్రాసెస్ ఇలా :
దరఖాస్తు చేయడం చాలా సులభం. ఈ కింది విధంగా అప్లయ్ చేయండి.

  • అధికారిక వెబ్‌సైట్‌ (trumpcard.gov) విజిట్ చేయండి.
  • ‘Apply Now’పై క్లిక్ చేయండి.
  • అప్లికేషన్ ఫారమ్‌లో అన్ని సరైన సమాచారాన్ని ఇవ్వండి.
  • ‘Continue Payment’పై క్లిక్ చేయండి.
  • అంతర్జాతీయ/US క్రెడిట్ కార్డ్ లేదా ACH డెబిట్‌తో చెల్లించండి.