Yamaha Fascino S Launch : సెక్యూరిటీ ఫీచర్లతో యమహా ఫాసినో S స్కూటర్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

Yamaha Fascino S Launch : ఈ యమహా స్కూటర్ 'యానసర్ బ్యాక్' అనే ఫీచర్‌తో వస్తుంది. యమహా మొబైల్ యాప్ ద్వారా కూడా వినియోగదారులు తమ ఫాసినో S మోడల్ ట్రాక్ చేయొచ్చు.

Yamaha Fascino S Launch : సెక్యూరిటీ ఫీచర్లతో యమహా ఫాసినో S స్కూటర్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

Yamaha Fascino S launched ( Image Source : Google )

Yamaha Fascino S Launch : కొత్త స్కూటర్ కొంటున్నారా? భారత మార్కెట్లోకి యమహా మోటార్ ఇండియా నుంచి ఫాసినోలో కొత్త వేరియంట్‌ లాంచ్ చేసింది. ఈ కొత్త స్కూటర్ ఫాసినో (S) అనే పేరుతో మార్కెట్లోకి వచ్చింది. ఈ కొత్త వేరియంట్ మోడల్ ధర రూ. 93,730 (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉంది.

Read Also : Bajaj Chetak 2901 : బజాజ్ చేతక్ 2901 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. టాప్ స్పీడ్ 63కి.మీ.. ధర ఎంతో తెలుసా?

ఆసక్తికరంగా, ఈ స్కూటర్ ‘యానసర్ బ్యాక్’ అనే ఫీచర్‌తో వస్తుంది. యమహా మొబైల్ యాప్ ద్వారా కూడా వినియోగదారులు తమ ఫాసినో S మోడల్ ట్రాక్ చేయొచ్చు. ఒకసారి ఈ యాప్ యాక్టివేట్ అయిన తర్వాత స్కూటర్ లెఫ్ట్, రైట్ ఇండికేషన్స్ హారన్ సౌండ్‌తో పాటు సుమారు రెండు సెకన్ల పాటు ఆన్ బ్లింక్ అవుతాయి.

మూడు కలర్ ఆప్షన్లలో యమహా ఫాసినో :
సెక్యూరిటీపరంగా ఈ ఫీచర్ అద్భుతంగా ఉంటుంది. భారత మార్కెట్లో యమహా ఫాసినో టీవీఎస్ జూపిటర్, సుజుకి యాక్సెస్, హీరో డెస్టినీ, హోండా యాక్టివాతో పోటీపడుతుంది. యమహా ఫాసినో S వేరియంట్ మొత్తం 3 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. మ్యాట్ రెడ్, మ్యాట్ బ్లాక్ ధర రూ. 93,730 (ఎక్స్-షోరూమ్), టాప్ ఎండ్ డార్క్ మ్యాట్ బ్లూ రూ. 94,530 (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉన్నాయి.

ఇది కాకుండా, ఫాసినో యాంత్రికంగా అలాగే ఉంటుంది. ఇప్పటికీ 8bhp, 10.3Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే అదే 125సీసీ, సింగిల్-సిలిండర్ మోటార్‌తో పనిచేస్తుంది. ఈ కొత్త వేరియంట్ బరువు 99కిలోలు, అండర్ సీట్ స్టోరేజ్ 21 లీటర్లు ఉంటుంది. ఫాసినోలో అందుబాటులో ఉన్న ఇతర రెండు వేరియంట్లు ‘డిస్క్’ ‘డ్రమ్’, ఈ రెండూ ‘S’ ట్రిమ్ కన్నా తక్కువ ధరను కలిగి ఉన్నాయి.

Read Also : Motorola Edge 50 Ultra : ఏఐ ఫీచర్లతో మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 18నే లాంచ్.. కీలక ఫీచర్లు ఇవే