Ranabaali Movie : విజయ్‌పై భారీ అంచనాలు.. ఎక్కడ చూసినా ‘రణబాలి’ ముచ్చటనే..
Ranabaali Movie : ఈ శుక్రవారం థియేటర్స్‌లోకి వస్తోంది విజయ్ దేవరకొండ రణబాలి సినిమా. భారీ అంచనాలు.. సాలిడ్ హైప్‌తో దసరా బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాడు విజయ్.
Ranabaali Movie
Ranabaali Movie : ఈ శుక్రవారం థియేటర్స్‌లోకి వస్తోంది విజయ్ దేవరకొండ రణబాలి సినిమా. భారీ అంచనాలు.. సాలిడ్ హైప్‌తో దసరా బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాడు విజయ్. మరి నెక్స్ట్ లెవల్ ప్రమోషన్స్‌తో విపరీతమైన బజ్ క్రియేట్ చేసిన రౌడీ హీరో.. రణబాలితో హిట్టు కొడతాడా? పాన్ ఇండియా రేంజ్లో విజయ్ దేవరకొండ సత్తా చాటుతాడా?
Also Read : Jailer 2 Review : ‘జైలర్ 2’ మూవీ రివ్యూ రజనీ మాస్.. హృతిక్ రోషన్ స్పెషల్ ఎట్రాక్షన్!
మాస్ అందరి వల్లా కాదు.. ఏదో అందరు ట్రై చేస్తున్నారని యాక్షన్ సినిమాలు చేస్తే.. అవి కాస్త వర్కౌట్ కాక ఇబ్బంది పడ్డ వాళ్లే ఎక్కువ. అయితే ఈ విషయంలో తనేంటో ప్రూవ్ చేసుకునేందుకు రణబాలిగా వస్తున్నారు విజయ్ దేవరకొండ. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కించిన రూరల్ బ్యాక్‌డ్రాప్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా.. రణబాలి అక్టోబర్ 16 ఈ శుక్రవారమే బాక్సాఫీస్ ముందుకొస్తుంది. సాధారణ టికెట్లు రేట్లు సహా దసరా హాలీడేస్.. విజయ్ దేవరకొండ రణబాలికి బిగ్ అడ్వాంటేజ్‌గా కనిపిస్తున్నాయి.
విజయ్ దేవరకొండ రణబాలి సినిమాని సపోర్ట్ చేస్తూ నేచురల్‌స్టార్ నాని వేసిన ట్వీట్ అందరి అటెన్షన్ గ్రాబ్ చేస్తోంది. రణబాలికోసం టీమ్ పడిన కష్టానికి తగిన రిజల్ట్ రావాలని విరోష్ జోడీతో పాటు రాహుల్ సాంకృత్యన్కి బెస్ట్ విషెస్ అందించారు. భారీ అంచనాలతో విడుదలవుతున్న రణబాలితో విజయ్ దేవరకొండ ఏ రేంజ్ కంబ్యాక్ ఇస్తారోనని ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నారు అభిమానులు. ఇండియాలో అక్టోబర్ 16 ఈ ఫ్రైడే బాక్సాఫీస్ ముందుకొస్తున్న రణబాలి ఓవర్సీస్లో ప్రీమియర్స్‌తోనే థియేటర్స్‌లోకి వచ్చేసింది.
రణబాలి సినిమాకి సంబంధించిన నార్త్ అమెరికా ప్రీ సేల్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. ఈ గురువారం ఓవర్సీస్లో ప్రీమియర్స్‌తో విడుదలైన రణబాలి.. అక్కడ 15వేలకిపైగా టికెట్ల అమ్మకాలతో 3లక్షల 25వేల డాలర్స్ కలెక్ట్ చేసి సర్ప్రైజ్ చేస్తోంది. దీంతో పాన్ ఇండియా వైడ్‌గా విడుదలవుతున్న విజయ్ దేవరకొండ రణబాలి.. మొదటి రోజు ఏ రేంజ్ ఓపెనింగ్స్ రాబడుతుందోననే అటెన్షన్ క్రియేటవుతోంది. మరి రణబాలి సినిమా కోసం నాలుగేళ్లకిపైగా శ్రమ పడిన విజయ్ దేవరకొండ-రాహుల్ సాంకృత్యన్ కష్టానికి.. ఆడియెన్స్ ఎలాంటి రిజల్ట్ అందిస్తారో వెయిట్ అండ్ సీ.
