Pune: అమ్మమ్మ గొలుసు లాక్కుంటున్న దొంగతో 10 ఏళ్ల చిన్నారి ఫైట్.. దెబ్బకు పారిపోయిన దొంగ
ఒక ముసలావిడ తన ఇద్దరు మనవరాళ్లతో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తోంది. ఇంతలో స్కూటీ మీద వెళ్తున్న వ్యక్తి ఆమె దగ్గర ఆగి ఏదో అడిగాడు. దానికి ఆమె సమాధానం చెప్తుండగా, గబుక్కున ఆమె మెడలో ఉన్న చైన్ అందుకోబోయాడు. ఆమె ఒక్కసారిగా అప్రమత్తమై తప్పించుకునే ప్రయత్నం చేసింది.
- tony bekkal
- Published on- March 10, 2023 / 03:26 PM IST
10y old girl foiled an attempt by a chain snatcher to snatch her grandmother's chain
Pune: రోడ్డు మీద నడుస్తుంటే బైక్ మీద వచ్చి టపీమని మెడలో ఉన్న గొలుసు లాగేసుకుని పారిపోతుంటారు. ఇలాంటి చర్యల వల్ల సొమ్ములు పోవడమే కాదు, కొన్నిసార్లు ప్రాణాల మీదకు వచ్చిన ఘటనలు లేకపోలేదు. ఇకపోతే, ఒక దొంగ రోడ్డు మీద వెళ్తున్న ముసలమ్మ మెడలో చైన్ లాక్కోవాలని ప్రయత్నించబోయాడు. కానీ 10 చిన్నారి దాడి చేసే సరికి, బతుకు జీవుడా అంటూ పారిపోయాడు. మహారాష్ట్రలోని పూణెలో ఫిబ్రవరి 25న జరిగిందీ ఘటన. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వీడియో ప్రకారం.. ఒక ముసలావిడ తన ఇద్దరు మనవరాళ్లతో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తోంది. ఇంతలో స్కూటీ మీద వెళ్తున్న వ్యక్తి ఆమె దగ్గర ఆగి ఏదో అడిగాడు. దానికి ఆమె సమాధానం చెప్తుండగా, గబుక్కున ఆమె మెడలో ఉన్న చైన్ అందుకోబోయాడు. ఆమె ఒక్కసారిగా అప్రమత్తమై తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఇంతలో అమ్మమ్మతో ఉన్న పదేళ్ల చిన్నారి తన చేతిలో ఉన్న బ్యాగుతో దొంగను కొట్టడం ప్రారంభించింది. దీంతో భయపడ్డ దొంగ, తన ప్రయత్నం మానుకుని అక్కడి నుంచి పరుగు పరుగున పారిపోయాడు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పూణె పోలీసులు తెలిపారు.
Land for Jobs Scam: తేజశ్వీ యాదవ్ ఢిల్లీ నివాసంలో ఈడీ సోదాలు
