Gujarat : గుజ‌రాత్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆయిల్ ట్యాంక‌ర్‌ను ఢీకొట్టిన కారు.. 10 మంది దుర్మ‌ర‌ణం

గుజ‌రాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది.

Gujarat : గుజ‌రాత్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆయిల్ ట్యాంక‌ర్‌ను ఢీకొట్టిన కారు.. 10 మంది దుర్మ‌ర‌ణం

Car Rams Truck On Ahmedabad-Vadodara Expressway several dead

Gujarat – Road Accident : గుజ‌రాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఆయిల్ ట్యాంక‌ర్‌ను కారు ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో 10 మంది మృతి చెందారు.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్‌వేపై న‌దియాడ్ స‌మీపంలో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. వ‌డోద‌ర నుంచి కారు అహ్మ‌దాబాద్ వైపు వెలుతోంది. న‌దీయాడ్ స‌మీపంలో రోడ్డు ప‌క్క‌గా నిలిపి ఉన్న ఆయిల్ ట్యాంక‌ర్ ను ఢీ కొట్టింది. ఆ స‌మ‌యంలో కారులో 10 మంది ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది ఘ‌ట‌నాస్థ‌లంలోనే మ‌ర‌ణించారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయ‌ప‌డిన ఇద్ద‌రిని సమీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ మిగిలిన ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య ప‌దికి చేరింది. ఈ ప్ర‌మాదం కార‌ణంగా అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్‌వేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది.

Bengaluru Woman : 270 సార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన.. బెంగళూరు మహిళకు రూ.1.36 లక్షల జరిమానా..!

మృతదేహాల‌ను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించిన పోలీసులు వాహ‌నాల‌ను రోడ్డు ప‌క్క‌కు జ‌రిపి ట్రాఫిక్‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.