Ankita Bhandari Murder Case: ఆ పనికి ఒప్పుకోలేదనే హత్య.. ఉత్తరాఖండ్ రిసార్ట్ మర్డర్ కేసులో కీలక విషయాలు
ఇప్పటికే ఈ విషయమై రాష్ట్రంలో తీవ్ర దుమారం లేసింది. రాజకీయంగా అయితే మరింత అగ్గి రగులుతోంది. దీంతో పులకిత్ తండ్రి అయిన వినోద్ ఆర్యను సోదరుడు అంకిత్ ఆర్యను భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ విషయమై స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి.. నిందితులు ఎలాంటి వారైనా వదిలేదని లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే రిసార్టును బుల్డోజర్లతో కూల్చివేశారు. కొంత మంది స్థానికులు అప్పటికే దానికి నిప్పు పెట్టారు.
- tony bekkal
- Published On : September 24, 2022 / 09:21 PM IST
Keay points came light over ankita bhandari murder case
Ankita Bhandari Murder Case: ఉత్తరాఖండ్ రిసార్టులో జరిగిన మర్డర్ కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. రిసార్టుకు వచ్చే అతిథులతో శృంగారం చేయడానికి ఒప్పుకోనందుకే అంకితను హత్య చేసినట్లు వెల్లడైంది. తన స్నేహితులతో అంకిత జరిపిన చాటింగ్ ఆధారంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రిసార్టుకు వచ్చే అతిథులతో శృంగారం చేయాలని ఆమెపై యజమాని ఒత్తిడి తీసుకువచ్చాడట. అందుకు ఆమె నిరాకరించడంతో ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోందని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ వెల్లడించారు.
హత్యకు ముందు తన స్నేహితుడికి ఫోన్ చేసి తాను ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పినట్లు సమాచారం. అనంతరం అంకితకు రాత్రి 8:30 గంటలకు ఫోన్ చేయగా.. కలవేలదని, దీంతో పులకిత్ ఆర్యకు ఫోన్ చేస్తే నిద్రపోవడానికి తన గదికి వెళ్లిందని చెప్పాడట. తర్వాతి రోజు అతడికి మళ్లీ ఫోన్ చేసి అంకిత గురించి అడుగుదామని ప్రయత్నించగా స్విచ్ ఆఫ్ వచ్చిందట. వెంటనే అతడి సోదరుడు అంకిత్ ఆర్యకు ఫోన్ చేస్తే అంకిత జిమ్లో ఉందని బదులిచ్చాడట. అయితే రిసార్ట్ చెఫ్ మాత్రం ముందు రోజు నుంచే అంకిత కనిపించడం లేదని చెప్పినట్లు అంకిత స్నేహితుడు తెలిపాడు.