ఇంఫాల్‌లో భారీ పేలుడు

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో భారీ పేలుడు సంభంవించింది. ఇంఫాల్‌ నగరంలోని థంగల్‌ బజార్‌లో షాపింగ్‌ కాంప్లెక్స్ ముందు శక్తిమంతమైన ఐఈడీ బాంబు పేలింది.

  • Publish Date - November 5, 2019 / 04:12 PM IST

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో భారీ పేలుడు సంభంవించింది. ఇంఫాల్‌ నగరంలోని థంగల్‌ బజార్‌లో షాపింగ్‌ కాంప్లెక్స్ ముందు శక్తిమంతమైన ఐఈడీ బాంబు పేలింది.

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో భారీ పేలుడు సంభంవించింది. ఇంఫాల్‌ నగరంలోని థంగల్‌ బజార్‌లో షాపింగ్‌ కాంప్లెక్స్ ముందు శక్తిమంతమైన ఐఈడీ బాంబు పేలింది. ఈ దాడిలో ఐదుగురు పోలీసులు, ఓ పౌరుడు గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఐఈడీ పేలుడు ధాటికి జనం పరుగులు తీశారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పేలుడు ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చింది.