CBSE Result 2025: సీబీఎస్‌ఈ 12వ తరగతి రిజల్ట్స్ విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
మీ వివరాలు నమోదు చేసి ఫలితాలు చూసుకోండి

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 12వ తరగతి రిజల్ట్స్‌ను ఆ బోర్డు విడుదల చేసింది. cbse.gov.in లేదా cbseresults.nic.inలో విద్యార్థులు ఫలితాలు చూసుకోవచ్చు. డిజీ లాకర్, ఉమాంగ్ యాప్‌లలోనూ చెక్ చేసుకోవచ్చు.
సీబీఎస్‌ఈ 12వ తరగతిలో స్టూడెంట్స్ ఉత్తీర్ణత శాతం 83.39గా నమోదైంది. 91.64 శాతం మంది బాలికలు, 85.70 శాతం మంది బాలురు ఉత్తీర్ణులయ్యారు. ఏపీలోని విజయవాడలో అత్యధికంగా 99.60 శాతం ఉత్తీర్ణత రికార్డయింది. అత్యల్పంగా ప్రయాగ్‌రాజ్‌లో 79.53 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
భారత్ వ్యాప్తంగా 7,842 సెంటర్లలో, అలాగే, మరో 26 దేశాల్లో సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలను సుమారు 42 లక్షల మంది విద్యార్థులు రాశారు.
వారిలో పదో తరగతి విద్యార్థులు 24.12 లక్షల మంది, 12వ తరగతి విద్యార్థులు 17.88 లక్షల మంది ఉన్నారు. సీబీఎస్‌ఈ కొన్నేళ్లుగా మెరిట్ లిస్టును విడుదల చేయడం లేదు. సీబీఎస్‌ఈ 10వ తరగతి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయన్న వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే, కొన్ని గంటల్లో ఆ ఫలితాలను కూడా వెల్లడించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
CBSE క్లాస్ 12 రిజల్ట్ ను ఇలా చెక్ చేసుకోండి
అధికారిక వెబ్‌సైట్లు results.cbse.nic.in, cbse.gov.inలో ఏదైనా ఓ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
CBSE క్లాస్ 12 రిజల్ట్ 2025 లింక్‌పై క్లిక్ చేయండి
మీ రోల్ నంబర్, పుట్టిన తేదీ, అడ్మిట్ కార్డ్ IDని నమోదు చేయండి
మీ ఫలితాన్ని చూసుకోవచ్చు
డిజిలాకర్ ద్వారా..
డిజిలాకర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి లేదా digilocker.gov.in ఓపెన్ చేయండి
CBSE క్లాస్ 12 రిజల్ట్ 2025పై క్లిక్ చేసి మీ వివరాలు నమోదు చేసి ఫలితాలు చూసుకోండి