Job fair at Jangam district on July 22
నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఎప్పటికప్పుడు జాబ్ మేళా నిర్వహిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే జులై 22న జనగామ జిల్లా కేంద్రంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి పి.సాహితి అధికారిక ప్రకటన చేశారు. జులై 22న నిర్వహించే ఉద్యోగ మేళాలో వరంగల్ కు చెందిన శ్రీరాం లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ పాల్గొన నుంది. ఈ సంస్థలో ఖాళీగా ఉన్న బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఏరియా మేనేజర్, డెవలప్మెంట్ ఆఫీసర్, సేల్స్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. కాబట్టి ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు తప్పకుండ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
విద్యార్హత:
టెన్త్, ఇంటర్, డిగ్రీ ఆపై చదువుల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
వయోపరిమితి:
అభ్యర్థుల వయసు 21 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి.
ఎంపిక విధానం:
అభ్యర్థుల విద్యా అర్హతకు అనుగుణంగా ఇంటర్వ్యూలు నిర్వహించి ఉత్తమ ప్రదర్శన ఆధారంగా సంబంధిత ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
జాబ్ మేళాలో పాల్గొనే అభ్యర్థులు విద్యా అర్హత సర్టిఫికెట్ల జిరాక్స్ లు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, బయోడేటా తీసుకొని రావాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం 7995430401 నెంబర్ ను సంప్రదించవచ్చు.