JEE Main 2026 Results : విద్యార్థులకు అలర్ట్.. JEE ఫలితాలపై అధికారిక ప్రకటన వచ్చేసింది.. ఇలా చెక్ చేసుకోండి

JEE Main 2026 Results : విద్యార్థులకు అలర్ట్.. జేఈఈ మెయిన్స్ ఫలితాల విడుదలపై అధికారిక ప్రకటన వచ్చేసింది.

NTA Announces jee main 2026 session 2 results on april 20

JEE Main 2026 Results : జేఈఈ మెయిన్స్ ఫలితాల కోసం ఎదురుచూస్తోన్న విద్యార్థులకు శుభవార్త. ఫలితాల విడుదలపై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఏప్రిల్ 20, సోమవారం ఫలితాలు విడుదల చేసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సిద్ధమైంది. పేపర్-1 స్కోర్‌కార్డు లింక్ ఏప్రిల్ 20, సోమవారం నాడు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనుంది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్ & పాస్‌వర్డ్ లేదా డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేసి రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. ఈ సెషన్ పరీక్షలు ఏప్రిల్ 2-8 వరకు నిర్వహించారు.

స్కోర్‌కార్డ్ వివరాలు:

సోమవారం వెల్లడించే ఫలితాలలో.. సబ్జెక్టుల వారీగా ఎన్‌టీఏ స్కోర్స్, టోటల్ పర్సంటైల్, కేటగిరీ వారీగా ర్యాంకులతో పాటు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధించారా లేదా అనే వివరాలు వెల్లడిస్తారు.

ర్యాంకుల కేటాయింపు:

విద్యార్థి.. రెండు సెషన్లలో అంటే జనవరి, ఏప్రిల్ నెలల్లో నిర్వహించిన పరీక్షల్లో పాల్గొంటే.. ఈ రెండింటిలో వచ్చిన పర్సంటైల్‌లో అత్యుత్తమ పర్సంటైల్‌ను పరిగణనలోకి తీసుకుని ఫైనల్ ర్యాంకును నిర్ణయిస్తారు.

అడ్వాన్స్‌డ్ అర్హత:

జేఈఈ మెయిన్ ఫలితాల్లో.. మొదటి 2.5 లక్షల ర్యాంకుల్లో నిలిచిన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

తర్వాతేం చేయాలి?

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 23న ప్రారంభమై మే 2న ముగుస్తుంది. దీనికి సంబంధించిన పరీక్ష మే 17, 2026న నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ ఫలితాల కోసం jeemain.nta.nic.in లేదా nta.ac.in వెబ్‌సైట్‌లను చూడవచ్చు.