DMHO Recruitment in Visakhapatnam
DMHO Visakhapatnam Recruitment : విశాఖపట్నం జిలాలోని వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒప్పంద ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
భర్తీ చేయనున్న పోస్టుల వివరాలకు సంబంధించి క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్ 2 ఖాళీలు, ప్లంబర్ 1, ఆడియో మెట్రిషియన్ 1, రేడియోగ్రాఫర్ 2 , ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ 1 , స్పీచ్ థెరపిస్ట్ 3 , ఈసీజీ టెక్నీషియన్స్ 1, డెంటల్ టెక్నీషియన్ 1, ఫార్మసిస్ట్ 1, ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును అనుసరించి పదోతరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్ , డిప్లొమా, బీఎస్సీ, డీఫార్మసీ, బీ ఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 42 సంవత్సరాలు మించరాదు.
అభ్యర్ధులు దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 7, 2023 గా నిర్ణయించారు. దరఖాస్తులను విశాఖపట్నంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://visakhapatnam.ap.gov.in/ పరిశీలించగలరు.