nirdpr recruitment
Nirdpr Recruitment : నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (నిర్డ్ పీఆర్) హైదరాబాద్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ మేనేజర్ (ఐటీ) పోస్టును కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Hashimoto Disease : హషిమోటో థైరాయిడైటిస్ పురుషుల కంటే మహిళల్లోనే అధికమా ?
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బీఈ, బీటెక్(సీఎస్ఈ,ఐటీ,ఈసీఈ) లేదంటే ఎంఈ, ఎంటెక్(సీఎస్ఈ, ఐటీ, ఈసీఈ) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయోపరిమితి 40 సంవత్సరాల లోపు ఉండాలి.
READ ALSO : Gluten : గోధుమ పిండితో తయారైన ఆహారాలు తింటే జీర్ణ సంబంధిత సమస్యలు ఉత్పన్నం అవుతాయా ?
అభ్యర్ధుల ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు వేతనంగా 1,00,000 చెల్లిస్తారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ఆఖరు తేదిగా ఆగస్టు 30 , 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; http://nirdpr.org.in/ పరిశీలించగలరు.