SAIL Recruitment 2025 : ప్రభుత్వ ఉద్యోగం కావాలా? SAILలో పరీక్ష లేకుండానే ఉద్యోగాలు.. నెలకు రూ. 2 లక్షల 50వేలు జీతం..!
SAIL Recruitment 2025 : సెయిల్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు పడ్డాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎవరైనా ఈ కింది అంశాలను తప్పకుండా చదవాలి. ఆ తర్వాతే అప్లయ్ చేసుకోండి.

SAIL Recruitment 2025
SAIL Recruitment 2025 : స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL)లో (ప్రభుత్వ ఉద్యోగం) పొందాలని యోచిస్తున్న అభ్యర్థులకు సువర్ణావవకాశం. ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు ఉన్న ఏ అభ్యర్థి అయినా సెయిల్ అధికారిక వెబ్‌సైట్ (sail.co.in)ని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకం ద్వారా మెడికల్ కన్సల్టెంట్స్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (GDMO) పోస్టులను భర్తీ చేస్తారు.
ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. మీరు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ఆలోచిస్తుంటే.. మార్చి 5న లేదా అంతకు ముందు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకం ద్వారా మొత్తం 20 పోస్టులను భర్తీ చేయనున్నారు. మీరు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ఆలోచిస్తుంటే, ఈ కింది ఇచ్చిన అంశాలను ఓసారి జాగ్రత్తగా చదవండి.
సెయిల్‌లో ఈ పోస్టులపై నియామకాలు :
- మైక్రోబయాలజీ స్పెషలిస్ట్ – 1 పోస్ట్
- ప్రసూతి, గైనకాలజీ స్పెషలిస్ట్ – 3 పోస్టులు
- పల్మనరీ స్పెషలిస్ట్ – 1 పోస్ట్
- పీడియాట్రిక్స్ స్పెషలిస్ట్ – 1 పోస్ట్
- అనస్థీషియాలజీ స్పెషలిస్ట్ -1
- పోస్ట్ పాథాలజీ స్పెషలిస్ట్- 1
- పోస్ట్ మెడిసిన్ స్పెషలిస్ట్ – 2 పోస్టులు
- ఆర్థోపెడిక్స్ స్పెషలిస్ట్ – 1 పోస్ట్
- ఆప్తాల్మాలజీ స్పెషలిస్ట్ – 1 పోస్ట్
- రేడియాలజీ స్పెషలిస్ట్ – 1 పోస్ట్
- పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ – 1 పోస్ట్
- జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (GDMO) – 5 పోస్టులు
- GDMO-OHS – 1 పోస్టు
అభ్యర్థుల అర్హత ఏంటి? :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో ఇచ్చిన సంబంధిత అర్హతను కలిగి ఉండాలి.
అభ్యర్థుల వయోపరిమితి ఎంత? :
సెయిల్ ఈ నియామకానికి దరఖాస్తు చేసుకోవాలని ఆలోచిస్తున్న వారి గరిష్ట వయోపరిమితి 69 సంవత్సరాలు ఉండాలి.
సెయిల్‌లో ఎంపిక ఇలా :
అభ్యర్థులను వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ డాక్యుమెంట్లతో పాటు రీసెంట్ ఫోటోకాపీల సెట్‌ను తీసుకురావడం తప్పనిసరి.
Read Also : Maha Shivratri 2025 : మహాశివరాత్రి రోజున పొరపాటున కూడా ఈ పువ్వుతో శివలింగాన్ని పూజించకూడదు.. ఎందుకంటే?
దరఖాస్తు విధానం ఇలా :
ఆసక్తిగల అభ్యర్థులు షెడ్యూల్ చేసిన తేదీలలో బర్న్‌పూర్ హాస్పిటల్, SAIL ISP వద్ద వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి. దాంతో పాటు, ఈ కింది డాక్యుమెంట్లను తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
- దరఖాస్తు ఫారం (Attachment-B)
- జనన ధృవీకరణ పత్రం (10వ తరగతి సర్టిఫికేట్)
- ఎంబీబీఎస్ మార్క్‌షీట్, డిగ్రీ సర్టిఫికేట్
- పీజీ డిప్లొమా/PG డిగ్రీ సర్టిఫికేట్ (వర్తిస్తే)
- మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (MCI/NMC/SMC)
- ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ (వర్తిస్తే)
- వ్యాలీడ్ ఐడెంటిటీ ప్రూఫ్ (ఆధార్, పాన్, ఓటరు ఐడీ కార్డ్ మొదలైనవి)
- కుల ధృవీకరణ పత్రం (వర్తిస్తే)