నిరుద్యోగులకు శుభవార్త : జూనియర్ ఇంజినీర్ పోస్టులు భర్తీ

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించింది. 2019కి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జూనియర్ ఇంజనీర్ పోస్టులు భర్తీ చేయనుంది. సివిల్, ఎలక్ట్రికల్,

  • Publish Date - February 5, 2019 / 01:46 AM IST

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించింది. 2019కి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జూనియర్ ఇంజనీర్ పోస్టులు భర్తీ చేయనుంది. సివిల్, ఎలక్ట్రికల్,

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించింది. 2019కి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జూనియర్ ఇంజనీర్ పోస్టులు భర్తీ చేయనుంది. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్,  క్వాంటిటీ సర్వేయింగ్ డిపార్టుమెంట్స్‌లో జూనియర్ ఇంజినీర్లను రిక్రూట్ చేయనుంది. 20 విభాగాల్లో జూనియర్ ఇంజనీర్లను నియమించనుంది. అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ విడుదల చేసింది.  అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ssc.nic.in వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ప్రాసెస్ మొదలైంది. SSC జేఈ పోస్టుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 25, 2019.  అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ 2019 సెప్టెంబర్ 23వ తేదీ నుంచి 29వ తేదీ మధ్య నిర్వహిస్తారు.

 

నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం:
https://ssc.nic.in/SSCFileServer/PortalManagement/UploadedFiles/notice_eng_jemec_01022019.pdf

 

విభాగాలు ఇవే:
* సెంట్రల్ వాటర్ కమిషన్
* సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్
* మిలిటరీ ఇంజినీర్ సర్వీసెస్
* ఫరుక్కా బ్యారేజీ ప్రాజెక్ట్
* నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్
* ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ 27, 30, 32