SVNIRTAR Recruitment : స్వామీ వివేకానంద్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిహాబిలిటేషన్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఒడిస్సాలో ఉద్యోగ ఖాళీ భర్తీ

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 58 జూనియర్‌, సీనియర్‌ రెసిడెంట్‌, ప్రొఫెసర్ తదితర పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

Swami Vivekanand National in Degree of Rehabilitation Training and Research Odisha Job Vacancies

SVNIRTAR Recruitment : కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన ఒడిస్సాలోని స్వామీ వివేకానంద్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిహాబిలిటేషన్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్ లో ఒప్పంద, ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 58 జూనియర్‌, సీనియర్‌ రెసిడెంట్‌, ప్రొఫెసర్ తదితర పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టును బట్టి పదో తరగతి, స్పీచ్‌ థెరపీ అండ్‌ ఆడియాలజీ/ఫిజియోథెరపీ/ఆక్యుపేషనల్ థెరపీ/లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్ లో డిగ్రీ, నర్సింగ్‌లో ఎమ్మెస్సీ/ఎండీ/డీఎన్‌బీ/ఎంబీబీఎస్/డిప్లొమా/పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 25 నుంచి 40 యేళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, అనుభవం ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.20,000 నుంచి రూ.70,000 వ‌ర‌కు జీతంగా చెల్లిస్తారు.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్‌ 28, 2022వ తుదిగడువుగా నిర్ణయించారు. దరఖాస్తు హార్డ్ కాపీలను చిరునామా: డైరెక్టర్, స్వామి వివేకానంద నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్, ఓలాత్‌పూర్, బైరోయ్ పోస్ట్, కటక్, ఒడిశా, పిన్:754040 పంపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు ; http://www.svnirtar.nic.in పరిశీలించగలరు.