పెళ్లి వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల సందడి.. చూశారా..?

కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం చాకలిపాలెంలో సందడి చేశారు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు. నందమూరి కుటుంబ ఆస్థాన సిద్ధాంతి కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు హీరో నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలిని, భార్య ప్రణతి.