మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జూపల్లి కృష్ణారావు
- జూపల్లి కృష్ణారావు, కొల్లాపూర్
- దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతానికి కీలకంగా పనిచేసిన నేత
- కొల్లాపూర్ నుంచి వరుసగా 5 సార్లు ఎన్నికైన తొలి ఎమ్మెల్యే
- మొత్తం ఆరుసార్లు MLAగా విజయం
- కాంగ్రెస్, టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అనుభవం
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తుమ్మల నాగేశ్వరరావు
- తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం
- సీనియర్ నేత, సుదీర్ఘ రాజకీయ అనుభవం
- గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం
- ఆరుసార్లు MLA, ఒకసారి MLCగా విజయం
- ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ క్యాబినెట్లో పనిచేసిన అనుభవం
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సీతక్క
- సీతక్క @ అనసూయ, ములుగు
- ST సామాజిక వర్గంలో బలమైన మహిళా నేత
- రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ అండదండలు
- గతంలో 15 ఏళ్లు మావోయిస్టుగా అజ్ఞాతవాసం
- ములుగు నుంచి మూడుసార్లు MLAగా గెలుపు
- 2009లో తొలిసారి MLAగా విజయం
- 2018, 2023 ఎన్నికల్లో MLAగా గెలుపు
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొండా సురేఖ
- కొండా సురేఖ, వరంగల్ ఈస్ట్
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫైర్‌బ్రాండ్ లీడర్‌గా గుర్తింపు
- గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం, విషయ పరిజ్ఞానం
- ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం
- 1999, 2004, 2009, 2014, 2023 ఎన్నికల్లో MLAగా విజయం
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పొన్నం ప్రభాకర్
- పొన్నం ప్రభాకర్, హుస్నాబాద్
- ఉత్తర తెలంగాణలో బలమైన బీసీ నేత
- విద్యార్థి రాజకీయాల నుంచి కాంగ్రెస్ పార్టీతోనే ప్రయాణం
- 2009లో కరీంనగర్ ఎంపీగా విజయం
- తొలిసారి అసెంబ్లీకి ఎన్నిక
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పాలేరు
- ఖమ్మం జిల్లాలో బలమైన లీడర్
- 2014లో ఖమ్మం ఎంపీగా గెలుపు
- 2023 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపు
- ఒకసారి MLA, ఒకసారి ఎంపీగా విజయం
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మంథని
- తెలంగాణ కాంగ్రెస్‌లో ముఖ్యమైన నేతల్లో ఒకరు
- ఏఐసీసీ పెద్దలతోనూ విస్తృత సంబంధాలు
- ఈ ఎన్నికల్లో మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు
- గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం
- మంథని నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపు
- 1999, 2004, 2009, 2018, 2023 ఎన్నికల్లో MLAగా గెలుపు
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి
- నల్గొండ జిల్లాలో ప్రజాదరణ ఉన్న నేత
- గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం
- ఐదుసార్లు MLA, ఒకసారి ఎంపీగా విజయం
- 1999, 2004, 09, 14, 23 ఎన్నికల్లో నల్లగొండ నుంచి విజయం
- వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి క్యాబినెట్లో పనిచేసిన అనుభవం
- 2019లో భువనగిరి ఎంపీగా విజయం
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దామోదర రాజనర్సింహ
- దామోదర రాజనరసింహ, అందోల్
- ఉమ్మడి ఏపీలో మాజీ ఉప ముఖ్యమంత్రి
- దామోదర ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయుడిగా గుర్తింపు
- అందోల్ నుంచి ఐదుసార్లు MLAగా విజయం
- 1989, 2004, 2009, 2014, 2023 ఎన్నికల్లో MLAగా గెలుపు
- మంత్రిగా పనిచేసిన అనుభవం
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ఆరుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా విజయం
- కాంగ్రెస్ అధిష్టానంతో సత్సంబంధాలు
- పీసీసీ మాజీ అధ్యక్షుడు, టీపీసీసీ కీలక నేత
డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం
రేవంత్ రెడ్డి చే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ తమిళిసై
ఎనుముల రేవంత్ రెడ్డి అను నేను…