ఈ క్రిస్మస్‌కు ముందుగానే కరోనా వ్యాక్సిన్ పంపిణీ!

  • Publish Date - November 5, 2020 / 12:13 PM IST

pre Christmas COVID vaccine : ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే డజన్ల కొద్ది కరోనా వ్యాక్సిన్లు ట్రయల్స్ దిశగా కొనసాగుతున్నాయి. ఇంగ్లండ్‌లో కరోనా వ్యాక్సిన్ ఈ ఏడాదిలో క్రిస్మస్‌కు ముందుగానే పంపిణీ చేయనుంది.



వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి నేషనల్ హెల్త్ సర్వీసు (NHS) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది ఆఖరిలో కరోనా వ్యాక్సిన్ రెడీగా ఉంటుందని ప్రభుత్వ రంగ ఆరోగ్య సేవ సంస్థ అధికారి ఒకరు వెల్లడించారు.



ప్రస్తుతం 200 వందల వరకు కరోనా వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయన్నారు. అందులో ఒకటైనా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.



వచ్చే ఏడాదిలో తొలి త్రైమాసికంలో కచ్చితంగా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని NHS ఇంగ్లాండ్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ సిమన్ స్టీవెన్స్ ఆశాభావం వ్యక్తం చేశారు.