వారం రోజుల్లో హైటెక్‌ సిటీకి మెట్రో

  • Publish Date - February 18, 2019 / 08:51 AM IST

వారం రోజుల్లో మెట్రోరైలు హైటెక్‌సిటీ వరకు పరుగులు పెట్టనున్నది. ఇప్పటికే నాగోల్ నుంచి అమీర్‌పేట వరకు మెట్రోరైలు మార్గం అందుబాటులోకి రాగా, అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ వరకు 10 కిలోమీటర్ల మార్గాన్ని అందుబాటులోకి తేనున్నారు.చాలా రోజులుగా ఐటీ ఉద్యోగులతోపాటు ఈ ప్రాంతాల ప్రజలు హైటెక్‌సిటీ వరకు మెట్రో ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

హైటెక్‌సిటీ వద్ద రివర్సల్ సౌలభ్యం లేకపోవడం వల్ల అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ వరకు ఒకే లైన్ నుంచి వెళ్లి తిరిగి అదేలైన్‌లో వెనుకకు రానున్నాయి. రెండు లైన్లు సిద్ధమైనప్పటికీ, రెండు లైన్లపై రాకపోకలు ఒకే డైరెక్షన్‌లో సాగనున్నాయి. సిగ్నలింగ్ సిస్టమ్స్‌లో CBTC(కమ్యూనికేషన్ బేస్‌డ్ ట్రైన్ కంట్రోల్) విధానం ట్విన్ సింగిల్ లైన్ విధానంలో పకడ్బందీగా పనిచేస్తుంది.

* 10 కిలోమిటర్ల మార్గంలో 8 స్టేషన్లు :
– మధురానగర్ 
– యూసఫ్ గూడ
– జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ – 5
– జూబ్లీహిల్స్ చెక్ పోస్టు
– పెద్దమ్మగుడి
– మాదాపూర్ 
– దుర్గంచెరువు
– హైటెక్ సిటీ

ట్రెండింగ్ వార్తలు