నిందితుల ఎన్ కౌంటర్ పై దిశ తండ్రి ఏమన్నారంటే

దిశ కొడుకు లేని లోటు తీర్చిందని ఆమె తండ్రి అన్నారు. దిశకు న్యాయం జరుగుతుందా లేదా అనే ఆందోళన ఉండేదన్నారు.

  • Publish Date - December 6, 2019 / 02:44 PM IST

దిశ కొడుకు లేని లోటు తీర్చిందని ఆమె తండ్రి అన్నారు. దిశకు న్యాయం జరుగుతుందా లేదా అనే ఆందోళన ఉండేదన్నారు.

దిశ కొడుకు లేని లోటు తీర్చిందని ఆమె తండ్రి అన్నారు. దిశకు న్యాయం జరుగుతుందా లేదా అనే ఆందోళన ఉండేదన్నారు. ఈ సంఘటన తరువాత రేప్ చేయడానికి భయపడాతరని చెప్పారు. ఆ నలుగురు తమకు కడుపు కోత మిగిల్చారని…వారి తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిల్చారని తెలిపారు. ప్రెషన్ నుంచి ఇంకా కోలుకోలేదన్నారు. 

అన్ని వ్యవస్థలో మార్పు రావాలని కోరారు. టెక్నాలజీ అప్ డేట్ కావాలన్నారు. పోలీస్ వ్యవస్థలో మార్పు రావాలన్నారు. విద్యార్థులు కూడా తల్లిదండ్రుల మాట వినాలన్నారు. వేస్ట్ టైమ్ లో బయట తిరుగకూడదని సూచించారు. డ్యూటీలు ముగించుకుని త్వరంగా ఇంటికి రావాలన్నారు. తల్లిదండ్రులకు అందుబాటులో ఉండాలని చెప్పారు. 

ఆడపిల్లల్లో పోలీసు వ్యవస్థ పట్ల అవగాహన కల్పించాలన్నారు. ఆడపిల్లలను టచ్ చేస్తే చస్తామనే భయం కలగాలన్నారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లే వారిని పోలీసులు గౌరవించాలని చెప్పారు. ఎవరైనా అన్యాయం జరిగిందంటే…అది తమకు జరిగినట్లు పోలీసులు భావించాలన్నారు. అప్పుడే పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందన్నారు. 

నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. దర్యాప్తులో భాగంగా చటాన్‌పల్లి దగ్గర సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేస్తున్న సమయంలో.. నిందితులు పారిపోతుండగా పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. నిందితులు దాడికి యత్నించారని.. అందుకే ఎన్‌కౌంటర్‌ చేశామని సీపీ సజ్జనార్‌ వెల్లడించారు. దాడికి దిగి పారిపోతుండగా.. లొంగిపోవాలని హెచ్చరించామని.. ఐనా.. నిందితులు వినకుండా పారిపోవడానికి ప్రయత్నించడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లోనే కాల్పులు జరిపినట్లు తెలిపారు.