తెలంగాణలో విద్యార్ధులే టీచర్లు..దేశంలోనే ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం.అదే ‘గ్రీన్ గురూస్’.
హైదరాబాద్: తెలంగాణలో విద్యార్ధులే టీచర్లు. దేశంలోనే ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం.అదే ‘గ్రీన్ గురూస్’. ముఖ్యంగా దళిత, గిరిజన నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్నారులకు సంక్షేమ గురుకులాల్లో అరుదైన శిక్షణ ఇచ్చి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు ఈ ‘గ్రీన్ గురూస్’ ఓ సరికొత్త విధానంగా చెప్పవచ్చు. లోపాలను అధిగమించేందుకు..స్టూడెంట్స్ లో టాలెంట్ ను పెంచుతు..క్రింద క్లాస్ విద్యార్ధులతో మమేకమవుతు చెప్పే ఈ స్టూడెంట్స్ టీచింగ్ (గ్రీన్ గురూస్) మంచి సత్పలితాలనిస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. ‘ఫ్రీడం స్కూల్’ పేరుతో తెలంగాణ సాంఘిక సంక్షేమ స్కూల్స్ లో తొలిసారి ఈ ప్రయోగాన్ని 2019/20 ఎడ్యుకేషన్ ఇయర్ లో ప్రారంభించనున్నారు.
ప్రాథమికస్థాయి నుండే విద్యార్థులను విజ్ఞాన వంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రయోగాత్మకంగా గ్రీన్ గురూస్ కార్యక్రమం ద్వారా వారిలో టీచింగ్ క్వాలిటీస్ ను పెంచేందుకు..సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్స్ లో టీచర్స్ సమస్య తలెత్తినపుడు నైపుణ్యం కలిగిన విద్యార్థులే సబ్జెక్టులు బోధించేలా దృష్టి పెడుతున్నామనీ..దీని కోసం తాము 80మంది స్టూడెంట్స్ ను సెలక్ట్ చేశామని తెలంగాణ సాంఘిక/సంక్షేమ గురుకుల పాఠశాలల కార్యదర్శిగా ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
మాథ్య్స్, సైన్స్, ఇంగ్లీష్, తెలుగు వంటి పలు సబ్జెక్టుల్లో ప్రతిభ వున్న స్టూడెంట్స్ తో ఆ క్రింది క్లాస్ పిల్లకు టీచింగ్ చెప్పేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో చెప్పే స్టూడెంట్స్ కు ఆ సబ్జెక్టులపై పట్టు పెరగటంతో పాటు టీచర్స్ కొరతను కూడా అధిగమిస్తు చిన్న క్లాస్ విద్యార్ధులు కూడా పరీక్షల చక్కగా రాయగలిగేందుకు..వారిలో ప్రతిభా పాటవాలను మెరుగుపరిచేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతినెలలో వారం రోజులపాటు ఆయా సబ్జెక్టు పీరియడ్‌లో టీచింగ్ చెప్పేందుకు ఆ స్టూడెంట్స్ కు టీచర్స్ గైడెన్స్ తో ఆ అవకాశం కల్పిస్తారు. ఇలా బోధించే గ్రీన్ గురూస్‌కు రూ.3500 ప్రతినెల మినిమమ్ సేలరీగా ఇస్తారు. ఈ మొత్తాన్ని ఆ విద్యార్థి ఉన్నత చదువుల కొరకు వినియోగించుకొనేందుకు బ్యాంకు ఎకౌంట్ లో వేస్తారు. గ్రీన్ గురూస్ ద్వారా పాఠ్యాంశాలు బోధించే విద్యార్థులకు తమ రోజువారి చదువులకు ఆటంకం కలుగకుండా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు ప్రవీణ్‌కుమార్.