హైదరాబాద్ : తెలంగాణలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. రాత్రిళ్లు ఉక్కపోస్తోంది. మండుతున్న ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటింది. మార్చి 1 సోమవారం భద్రాత్రి కొత్తగూడెం జిల్లాలో 43.2, ఆదిలాబాద్ జిల్లాలో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత లు రికార్డు అయ్యాయి.
కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రాజన్నసిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. మార్చి 2 మంగళవారం అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతోపాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.