Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. బోనాల పండుగ వేళ భారీగా ట్రాఫిక్ మళ్లింపులు.. ఈ రూట్లలో అస్సలు వెళ్ళకండి!
భాగ్యనగరంలో అంగరంగ వైభవంగా జరగనున్న బోనాల నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ (Hyderabad Traffic Alert)పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Hyderabad bonalu festival traffic advisory road closures and diversion routes
- హైదరాబాద్‌లో బోనాల ట్రాఫిక్ ఆంక్షలు
- కీలక ప్రాంతాల్లో రహదారుల మళ్లింపులు
- భక్తుల కోసం ప్రత్యేక పార్కింగ్
Hyderabad Traffic Alert: భాగ్యనగరంలో అంగరంగ వైభవంగా జరగనున్న బోనాల పండుగ ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. లాల్ దర్వాజా, కార్వాన్, అంబర్పేట్, చిలకలగూడ ప్రాంతాల్లో భక్తుల రద్దీ, అమ్మవారి ఊరేగింపుల నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ (Hyderabad Traffic Alert)పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికులు, వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆగస్టు 9, 10 తేదీల్లో నగరవ్యాప్తంగా పలు ప్రధాన మార్గాల్లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధిస్తున్నట్లు ప్రకటించారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ప్రత్యామ్నాయ మార్గాలతో పాటు, పార్కింగ్ ప్రదేశాలను కూడా ఏర్పాటు చేశారు.
ప్రధాన రహదారుల మూసివేత, ప్రత్యామ్నాయ మార్గాలు:
చారిత్రాత్మక పాతబస్తీ లాల్ దర్వాజా బోనాల దృష్ట్యా మదీనా ఎక్స్ రోడ్స్ నుండి ఇంజిన్ బౌలి వరకు ప్రధాన రహదారిని పూర్తిగా మూసివేస్తున్నారు. ఆర్టీసీ బస్సులను పాత సీబీఎస్, దారుల్ షిఫా వైపు నిలిపివేస్తారు. అటు అంబర్పేట్ మహంకాళి ఆలయ ఉత్సవాల కోసం భారీ వాహనాలు, బస్సులను అంబర్పేట్ ఫ్లైఓవర్ మీదుగా పంపిస్తారు. కార్వాన్ దర్బార్ మైసమ్మ, చిలకలగూడ కట్ట మైసమ్మ ఆలయాల పరిసరాల్లోనూ ఉదయం నుంచి రాత్రి వరకు సాధారణ ట్రాఫిక్ దారి మళ్లించనున్నారు.
వాహనదారులకు పోలీసుల కీలక సూచనలు:
వివిధ మార్గాల గుండా వచ్చే భక్తుల కోసం అల్కా థియేటర్, చార్మినార్ బస్ టెర్మినల్, జీహెచ్ఎంసీ మైదానాల్లో ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కల్పించారు. నగరవాసులు ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని ట్రాఫిక్ జాయింట్ సీపీ విజ్ఞప్తి చేశారు. ప్రయాణంలో అత్యవసరమైతే 9010203626 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలని, తాజా సమాచారం కోసం ట్రాఫిక్ పోలీసుల సోషల్ మీడియా ఖాతాలను అనుసరించాలని కోరారు.
