ms-dhoni-chennai-super-kings
Ms Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహీంద్ర సింగ్ ధోనీ చెన్నైలో ల్యాండ్ అయ్యాడు. మరి కొద్ది రోజుల్లో మొదలుకానున్న IPL 2021 గురించి లేటెస్ట్ అప్ డేట్ గా వినిపిస్తుంది. మార్చి 9నుంచి ట్రైనింగ్ క్యాంప్ స్టార్ట్ అవనున్నట్లు సమాచారం. బుధవారం సాయంత్రం చెన్నైలో ల్యాండ్ అయిన టీమిండియా మాజీ కెప్టెన్ ఐదు రోజుల క్వారంటైన్ తర్వాత బయటకు వస్తారు.
ఈ మేరకు సీఎస్కే.. ధోనీ ఎయిర్‌పోర్టులో ఉన్న ఫొటోను పోస్టు చేస్తూ ట్వీట్ చేసింది. తలై-వా ! మాస్క్ తో చిరునవ్వు! ఇది సూపర్ నైట్! అంటూ #DenComing #WhistlePodu #Yellove” అనే హ్యాష్ ట్యాగులతో పోస్టు చేసింది. అంతేకాకుండా టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్ అంబటిరాయుడు కూడా బుధవారం నాడే చెన్నై చేరుకున్నారు. మిగిలిన తమిళనాడు ప్లేయర్లు జట్టులో కాస్త నిదానంగా జాయిన్ అవుతారు.
ఇక సీఈఓ కేఎస్ విశ్వనాథన్ మాట్లాడుతూ.. మార్చి 9నుంచి ట్రైనింగ్ క్యాంప్ మొదలుపెట్టే అవకాశముంది. అప్పటికల్లా అందుబాటులో ఉన్నవారు శిక్షణ క్యాంపులో పాల్గొంటారు. దాని కంటే ముందు ఐదు రోజుల క్వారంటైన్ లో ఉండాలి. వారికి మూడు నెగెటివ్ టెస్టులు తర్వాతనే ట్రైనింగ్ కు అనుమతిస్తారు.
టీమిండియా ప్లేయర్లు కూడా ట్రైనింగ్ లో పాల్గొంటారు. దాదాపు వాళ్లంతా బ్యాచ్ ల వారీగా ఉండొచ్చు. ఐపీఎల్ 14వ సీజన్ షెడ్యూల్ ఇంకా కన్ఫామ్ కాలేదు.
ఇటీవలే ముగిసిన ఐపీఎల్ మినీ వేలంలో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీని రూ.7కోట్లకు, కర్ణాటక ఆల్ రౌండర్ కే.గౌతమ్‌ను రూ.9.25కోట్లకు, చతేశ్వర్ పూజారా రూ.50లక్షలకు కొనుగోలు చేసింది సీఎస్కే. అంతేకాకుండా మరో ఐదుగురు తమిళనాడు బ్యాట్స్‌మన్‌ను కూడా జాబితాలో చేర్చుకుంది. సీ హరి నిషాంత్, హరిశంకర్ రెడ్డీ, భగత్ వర్మను రూ.20లక్షల చొప్పున సొంతం చేసుకుంది.