హైదరాబాద్ : సోషల్ మీడియాని సమచారానికే కాదు వ్యాపారానికి కూడా ఫుల్ గా వాడేసుకుంటున్నారు. ఏదైనా వ్యాపారం చేయాలంటే ఓ ఆఫీసుండాలి..లేదంటే ఏదొక ప్లేస్ వుండాలి..ఆఫీస్ లో ఏ చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వేలకు వేలు అడ్వాన్సెస్ ఇవ్వాలి..కానీ సోషల్ మీడియాలో రూపాయి పెట్టుబడి పెట్టకుండానే చిన్నా చితకా బిజినెస్ లు హల్ చల్ చేస్తున్నాయి. అదీకూడా ఎక్కడికీ వెళ్లకుండా హాయిగా ఇంట్లో కూర్చునే బిజినెస్ లు చేసేస్తున్నారు. ఈ క్రమంలో స్మార్ట్ ఫోన్ కాంటాక్ట్ తో సోషల్ మీడియాను వేదిక ఇప్పుడు పాముల బిజినెస్ హల్ చల్ చేస్తోంది.
కాదేదీ వ్యాపారానికి అనర్హం…
తమ వద్ద అక్రమంగా దాచిపెట్టిన రెండు పాముల్ని సోషల్ మీడియా కాంటాక్ట్ తో అమ్మకానికి పెట్టారు ఇద్దరు యువకులు. రాష్ట్రం మేడ్చల్ జిల్లా ఘటకేసర్ మండలం చౌదర్‌గూడలోని వెంకటాద్రి టౌన్‌షిప్‌లో వుంటున్న షారన్‌మోసెస్ ఫ్రెండ్ వానోరస్ ప్రవీణ్ కలిసి పాముల్ని అమ్మే క్రమంలో రెడ్డ హ్యాడెడ్ గా పట్టుబడి కటకటాలపాలయ్యారు. వీరిద్దరూ కొన్ని రోజుల క్రితం ఒక కొండ చిలువను, మనుపాము (Break Back Snake) అమ్మేందుకు ప్రవీణ్ కొండ చిలువ మెడలో వేసుకుని సెల్ఫీ దిగా ఆ ఫొటోలను ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో అప్‌లోడ్ చేశాడు. ఈ పోస్టులు వైరల్‌గా మారి..మారి ఫారెస్ట్ ఆఫీసర్స్ దృష్టికి వెళ్లటంతో జనవరి 7న వారి ఇంటిపై దాడిచేసి రెండు పాములను స్వాధీనం చేసుకున్నారు. అనంరతం ఇద్దరినీ అదుపులోకి తీసుకుని రంగారెడ్డి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరు పరిచారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారం కొండచిలువ అమ్మకానికి ప్రయత్నించిన వారికి మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, పది వేల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉందని ఫారెస్ట్ ఆఫీసర్స్ తెలిపారు.