Metro-RTC Common Pass: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న ‘ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్’ ధరలు.. సర్కార్ కీలక సమీక్ష

ప్రయాణికుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో, ఆర్టీసీ-మెట్రో కామన్(Metro-RTC Common Pass) పాస్ రేటును తగ్గించే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది.

Telangana government considering reducing Metro and bus common pass prices

Metro-RTC Common Pass: హైదరాబాద్ నగరంలోని ప్రయాణికుల కోసం టీజీఎస్ఆర్టీసీ బస్సులు, హైదరాబాద్ మెట్రో రైళ్లలో(Metro-RTC Common Pass) ఉమ్మడిగా ప్రయాణించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్’పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా రవాణాను మరింత అందుబాటులోకి తేవాలనే సదుద్దేశంతో ఈ కామన్ పాస్‌ను ప్రవేశపెట్టినప్పటికీ, దీని కొనుగోలుకు నిర్ణయించిన భారీ ధర పట్ల నగరవాసులు, ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బస్సు, మెట్రో రెండింటికీ కలిపి ఒకే పాస్ ఉండటం ప్రయాణ సమయాన్ని ఆదా చేస్తుందని భావించినప్పటికీ, సాధారణ మధ్యతరగతి ప్రజలకు ఈ పాస్ భారంగా మారింది.

US Debt Crisis: అమెరికాలోనూ అంతే.. అప్పుల్లో జనం, EMIలు పెండింగ్.. ఒక్కొక్కరికి..

రూ.8,400 ధరపై నగరవాసుల తీవ్ర విమర్శలు.. త్వరలోనే రీజనబుల్ ధరకు తగ్గించే యోచన:

ఈ కామన్ పాస్ ధరను ఏకంగా రూ. 8,400గా నిర్ణయించడంపై సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ట్రోలింగ్, విమర్శలు మొదలయ్యాయి. సాధారణ నెలవారీ ప్రయాణ వ్యయం కంటే కామన్ పాస్ ధర చాలా ఎక్కువగా ఉండటంతో ప్రయాణికుల నుంచి ఆశించిన స్పందన కరువైంది. దీంతో ప్రజా స్పందనను, విమర్శలను ప్రాతిపదికగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. కామన్ పాస్ ధరను గణనీయంగా తగ్గించాలనే ఆలోచనలో పడింది. ఎంత మేర తగ్గిస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉన్నప్పటికీ, ప్రయాణికులకు రీజనబుల్ ధరకు అందుబాటులోకి తెచ్చేలా త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.