పాపం.. పూజారా రనౌట్‌కు నవ్వేస్తున్న ఇంటర్నెట్
- Subhan Ali Shaik
- Published On : February 15, 2021 / 03:44 PM IST
Cheteshwar Pujara: చెన్నై మైదానంలో బ్యాటింక్ క్లిష్టంగా మారిందనేది కనిపిస్తోంది. కాకపోతే మరీ ఈ రేంజ్ లో పూజారా ఫన్నీ రనౌట్ అవడం చూసి నవ్వేసుకుంటున్నారు నెటిజన్లు. రన్ కోసం యత్నించి బంతి ఎంతో దూరం వెళ్లలేదని వెనక్కురాబోయాడు. బ్యాట్ అయితే క్రీజు వరకూ తీసుకురాగలిగాడు. కానీ, రనౌట్ మాత్రం తప్పలేదు పాపం.
మూడో రోజు తొలి ఓవర్‌లోనే మొయిన్ అలీ బౌలింగ్ లో నేరుగా ఓలీ పోప్ కు నేరుగా షాట్ కొట్టి అవుట్ అయ్యాడు. బంతి వెళ్లిపోతుందనుకుని రన్ తీసేందుకు ప్రయత్నించాడు. దురదృష్టవశాత్తు ఓలీ పోప్ దాన్ని పట్టేసుకున్నాడు. వెనక్కు తిరిగి.. క్రీజులోకి వెళదామనుకుని బ్యాట్ పెట్టే సమయానికి చేతిలో నుంచి జారిపోయింది.
క్రీజులోకి వెళ్లిపోదామని ట్రై చేసి ముందుకు వెళ్లేసరికే.. కీపర్ బంతి అందుకుని స్టంప్స్ తాకించాడు. దీనిపై నెటిజన్లు సెటైర్లు వేసుకుంటూ.. జాలి చూపిస్తూ నవ్వుకుంటున్నారు.
Bad Luck
Bad Luck Pro
Pujara Run-out#INDvENG @cheteshwar1 pic.twitter.com/fcJ0BYjuOI— Chikmaya Kumar Dash (@ckdash045) February 15, 2021
