Santokh Singh: రాహుల్‌తో కలిసి భారత్ జోడో యాత్రలో నడుస్తుండగా ఎంపీ సంతోఖ్ సింగ్‌కి గుండెపోటు.. మృతి

ఎంపీ రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో నడుస్తున్న సమయంలో కాంగ్రెస్ నేత, పంజాబ్ లోని జలంధర్ నియోజక వర్గ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి ఇవాళ ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. రాహుల్ తో కలిసి సంతోఖ్ సింగ్ చౌదరి పాద్రయాత్రలో పాల్గొన్న సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది.

Bharat Jodo Yatra: ఎంపీ రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో నడుస్తున్న సమయంలో కాంగ్రెస్ నేత, పంజాబ్ లోని జలంధర్ నియోజక వర్గ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి (76) ఇవాళ ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. రాహుల్ తో కలిసి సంతోఖ్ సింగ్ చౌదరి పాద్రయాత్రలో పాల్గొన్న సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది.

దీంతో వెంటనే సంతోఖ్ సింగ్ చౌదరిని ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆయన మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో పంజాబ్ లో భారత్ జోడో యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్రలో పాల్గొనే సమయంలోనే సంతోఖ్ సింగ్ అలసిపోయినట్లు కనపడ్డారు.

ప్రస్తుతం ఆయన భౌతికకాయం ఆసుపత్రిలోనే ఉంది. రాహుల్ గాంధీతో పాటు ఎమ్మెల్యేలు రాణా గుర్జీత్ సింగ్, విజయ్ సింగ్లా ఆసుపత్రి వద్దే ఉన్నారు. సంతోఖ్ సింగ్ చౌదరి మృతి పట్ల సంతాపం తెలుపుతున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి భవంత్ మాన్ ట్వీట్ చేశారు.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కూడా సంతోఖ్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలిపారు. కాగా, ఇప్పటికే పలు రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ పాదయాత్ర పూర్తి చేశారు. ఆయన భారత్ జోడో యాత్ర చివరి దశకు చేరుకుంది.


Earthquake In Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.2గా నమోదు

ట్రెండింగ్ వార్తలు