Skywalk rescue Video: స్కైవాక్ రూఫ్‌పైకి ఎక్కిన యవకుడు.. లాక్కొచ్చేందుకు నానా తంటాలు పడ్డ ఐదుగురు

స్కైవాక్ రూఫ్‌పైకి ఎక్కి హల్‌చల్ చేశాడో యవకుడు.. అతడిని లాక్కొచ్చేందుకు ఐదుగురు నానా తంటాలు పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన ముంబైలోని గావ్‌దేవీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ యువకుడి పేరు షకీల్ అహీయా (24) అని, అతడు డ్రగ్స్ కు బానిసై దాని ప్రభావంతో ఇలా నానా చౌక్ లోని స్కైవాక్ రూఫ్‌పైకి ఎక్కాడని అధికారులు తెలిపారు.

Mumbai skywalk rescue: స్కైవాక్ రూఫ్‌పైకి ఎక్కి హల్‌చల్ చేశాడో యవకుడు.. అతడిని లాక్కొచ్చేందుకు ఐదుగురు నానా తంటాలు పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన ముంబైలోని గావ్‌దేవీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ యువకుడి పేరు షకీల్ అహీయా (24) అని, అతడు డ్రగ్స్ కు బానిసై దాని ప్రభావంతో ఇలా నానా చౌక్ లోని స్కైవాక్ రూఫ్‌పైకి ఎక్కాడని అధికారులు తెలిపారు.

మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద అతడిని విచారిస్తున్నామని చెప్పారు. స్కైవాక్ రూఫ్‌పైకి ఎక్కిన అతడిని గుర్తించిన సిబ్బంది ఆ యువకుడి వద్దకు వెళ్లారు. ఆ సమయంలో రూఫ్ పైనే కూర్చొని అతడు నానా హంగామా చేశాడు. ముందుకు కదలకుండా సిబ్బందిని విసిగించాడు. ఐదుగురు కలిసి అతడిని రూఫ్ నుంచి కిందకు జాగ్రత్తగా లాక్కురావాల్సి వచ్చింది. అతడిని కిందకు దించడానికి రెండు గంటల సమయం పట్టిందని అధికారులు చెప్పారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..